ఆరోగ్యం / జీవన విధానం

పెసలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

0

ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న వయస్సులోనే పెద్ద వయస్సు మాదిరి కనిపిస్తుంటారు. దీనికి కారణం మనం తినే ఆహారంలో మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. అలా జరక్కుండా ఉండాలంటే మీ డైట్ లో ఈ ఆహారాలను తీసుకోండి.
పెసలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ వాటిని మొలకల్లో వచ్చేటట్లు చేసి తినడం వల్ల చాలా లాభాలుంటాయి. మొలకల్లో ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని తినాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. వీటిని తినడం వల్ల కాలేయము, జుట్టు, గోళ్లు, కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. మొలకలు తినడం వల్ల కొంచెం తిన్న కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా తక్కువ తింటారు. దీని వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. పెసలు రోజు తినడం వల్ల వారి నిజ వయస్సు కన్నా 10 ఏళ్ల చిన్న వయస్సు గా కనబడతారు. ఎందుకంటే పెసల్లో వుండే కాపర్ వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. అజీర్తితో బాధపడే వాళ్ళు కి పెసలు బాగా ఉపయోగపడతాయి. ఇవే కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అంతే కాకుండా వీటిలో వుండే కాల్షియం వల్ల ఎముకలు ధృడంగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే సోడియం కూడా ఉన్నందున దంతాలు, చిగుళ్ల సమస్యలు నివారిస్తుంది. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. పెసల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అన్ని అవయవాలకు ఆక్సిజన్ ను సక్రమంగా అందేటట్లు చేస్తుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పిల్లల పెరుగుదలలో పెసలు ముఖ్య పాత్ర వహిస్తాయి.

Leave Your Comments

కినోవా పంట సాగు.. రైతు లాభాల బాట

Previous article

దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 55 శాతం కేవలం తెలంగాణ నుండే – వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Next article

You may also like