ఆరోగ్యం / జీవన విధానం

కొర్ర బియ్యం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

0

ప్రస్తుతం బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయని అందువల్ల గుండె జబ్బులు, మధుమేహం సమస్యలు వస్తున్నాయని చాలామంది చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు. వాటిలో కొర్రబియ్యం ఇప్పుడు చేరిపోయింది. అంతా వాటి పట్ల ఇష్టతను ప్రదర్శిస్తున్నారు. ఈ కొర్రలు ఆరోగ్యానికి మంచిదా కాదా తెలుసుకుందాం..
గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అనేక ఆరోగ్య సమస్యలను కలిగించే గ్లూటెన్ కొర్రబియ్యంలో ఉండదు. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచటంలో సహాయపడుతుంది.
కీళ్లనొప్పులను, జ్వరాన్ని తగ్గిస్తుంది. కాలిన గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడుతుంది. స్త్రీలలో రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతుంది.
కొర్రలలో మాంసకృత్తులు, ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన ఇది మలబద్దక సమస్యను తగ్గిస్తుంది.
దీనిలో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, థైమిన్, రైబోఫ్లేవిన్ అధికపాళ్ళలో ఉంటాయి. డయాబెటిస్ రోగులకు కొర్రబియ్యం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని పూర్తిగా అదుపులో ఉంచుతుంది.
ఉదర సంబంధ సమస్యలకు కొర్రబియ్యం చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో నొప్పి, ఆకలి లేకపోవడం, అజీర్తి సమస్యలకు ఇది చక్కగా పనిచేస్తుంది. జీర్ణ నాళాన్ని శుభ్రం చేయడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది మూత్రం పోసేటప్పుడు మంటను తగ్గిస్తుంది.
కొర్ర బియ్యం వండు విధానం:
ఒక గ్లాసు కొర్రలను శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు నీరు పోసి ఒక గంట నానబెట్టాలి. నానబెట్టిన కొర్రబియ్యాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించాలి. ఒకవేళ ఇలా తినలేకపోతే సగం బియ్యం, సగం కొర్రలు కలిపి వండుకోవచ్చు. ఈ అన్నంలో వేపుడు కూరలకన్నా పులుసు కూరలు ఎక్కువ రుచిని ఇస్తాయి.

Leave Your Comments

నకిలీ విత్తనాలను అరికట్టడంతోపాటు నాణ్యతను పెంచే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు..

Previous article

కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తరువాత తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు..

Next article

You may also like