ఆరోగ్యం / జీవన విధానం

రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

0

మన పెద్దవారు అప్పట్లో రాగి పాత్రలోనూ, రాగి చనెబు ల్లోనూ నీళ్లు తాగేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఎప్పుడు చాలా మంది అదే పద్ధతిని పాటిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న అనారోగ్యాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పాతకాలం పద్ధతులనే వాడుతున్నారు. ఇలా వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. పాత్రలో నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
శరీరానికి అవసరమైన ఖనిజాలు రాగి ముఖ్యమైనది. ఆకుకూరలు, బీన్స్ తేన వంటి వాటిలో కాపర్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల అంతే కాపర్ శరీరానికి అందుతుంది. కానీ రాగిపాత్రలో నీటిని కనీసం 8 గంటలైనా నిల్వ ఉంచాలి.
రాగిపాత్రలో నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్ సమస్య రాకుండా చూసుకోవచ్చు. అందులో ఉండే అయ్యానికత వల్ల శరీరంలో కాపర్ నిల్వలు పెరుగుతాయి. ఫలితంగా థైరాయిడ్ సమస్యను నివారించవచ్చు.
జీర్ణక్రియ సమస్యతో బాధపడే వాళ్ళు రాగిపాత్రలో నీళ్లు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ నీళ్లు తాగడం వల్ల శరీరంలోని హానికారక బ్యాక్టీరియాలు నాశనమవుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
మెదడుకు సంకేతాలను అందించడంలో పనిచేసే న్యూరాన్లకు కవచంలా ఉపయోగపడే మైలీన్ తొడుగులు తయారు కావడానికి రాగి పాత్రలో నీరు సహాయపడుతుంది. దీనివల్ల అత్యంత వేగంగా మెదడుకు సంకేతాలు అందుతాయి. అందువల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
రాగి నీటిలో వుండే బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. నీటి ద్వారా వ్యాపించే డయేరియా, జాండీస్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. కాబట్టి రాగి పాత్రల్లో నీళ్లు తాగడం చాలా మంచిది.
గుండె సంబంధిత వ్యాధులు రాకుండా రాగి పాత్రల్లో నీళ్లు అడ్డుకుంటాయి. అంతేకాకుండా కొవ్వు స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అలాగే శరీరములో క్యాన్సర్ కణాలను ఏర్పడకుండా చేస్తాయి. అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు ప్రతిరోజూ రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఈ నీటిలో వుండే కాపర్ కొవ్వు నిల్వలను తగ్గించి బరువు తగ్గేందుకు సహాయపడతాయి.
రాగి పాత్రల్లో నీళ్లు తాగడం వల్ల నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎముకలు కూడా ధృడంగా ఉంటాయి. అలాగే ఆర్థరైటిస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి కూడా విముక్తి కలుగుతుంది.

Leave Your Comments

మొక్కల్లో పోషకాలు వృద్ధి పరిచే మిశ్రమాన్ని ఆవిష్కరించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట రెడ్డి

Previous article

పీఎం కిసాన్ యోజన పథకంలో ఉన్నవారికి మరికొన్ని సేవలు..

Next article

You may also like