Health Benefits of Curd: అధిక వేడి, ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం కోసం పెరుగును ఏదో ఒక రూపంలో తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు.పెరుగును ఫ్రూట్ సలాడ్ లేదా బ్లెండెడ్ స్మూతీస్ లేదా మజ్జిగ లాగా తీసుకోవడం పరిపాటి. సాధారణంగా పెరుగును రోజూ తినడం వలన ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. భారతదేశంలో, పెరుగు దాదాపు అన్ని వంటశాలలలో ప్రధానమైనది. గ్రేవీలు మరియు కూరలకు క్రీమును ఎక్కువగా ఉపయోగిస్తారు. మాంసాలు మరియు కబాబ్ లను మెరినేట్ చేయడం కోసం కూడా వాడుతారు. దీని రుచి, ఆరోగ్యానికి చలువ కారణంగా రోజువారీ తెలుగు భోజనంలో గొప్ప అనుబంధాన్ని సంపాదించుకుంది, అయితే ప్రతి రోజూ పెరుగు తింటే అది మనకు అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలీదు. మీరు కూడా ఎప్పుడైనా ఆలోచించారా?
Also Read: వేసవిలో పెరుగు దివ్యామృతం
పాల నుండి తయారు చేసే పెరుగులో కాల్షియం, విటమిన్ బి2, విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పెరుగు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.పెరుగు తినడం వలన జీర్ణక్రియకు అమోఘమైన మేలు చేస్తుంది.దీనిలో ఉండే లాక్టిక్ ఆసిడ్ బాక్టీరియా ప్రోబయోటిక్. ఇది ప్రేగులలో చెడు తొలిగించి జీర్ణవ్యవస్థను శుద్ధి చేస్తుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది :పెరుగులో జీవించే యాక్టివ్ బ్యాక్టీరియా వ్యాధి కారకాలతో పోరాడగలదు,అలాగే ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగు లో రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరిచే, లాక్టోబాసిల్లస్, విటమిన్ లు మరియు ప్రోటీన్ లు కోకొల్లలుగా ఉంటాయి.
ఆరోగ్యకరమైన, నిగనిగలాడే చర్మం : పెరుగు తినడం వలన చర్మము తేమను కోల్పోదు. సహజంగా ఉండే పొడి చర్మాన్ని నయం చేయడంలో గుణకారి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేసి చనిపోయిన చర్మ కణాలను తొలగించడమే గాక వృద్ధాప్య ప్రారంభ సంకేతాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుకే దీనిని స్త్రీలు ఫేస్ ప్యాక్ లలో సాధారణంగా ఉపయోగిస్తారు.
పెరిగిన రక్తపోటును తగ్గించగలదు : పెరుగు అధిక రక్తపోటును నివారించడానికి సహాయపడుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) ప్రకారం, పెరుగు తినడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. కొవ్వు తీసిన పెరుగును అధికంగా తీసుకునే వారిలో అధిక రక్తపోటు సమస్య వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
స్త్రీలలో యోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది : లాక్టోబాసిల్లస్ అనే పేరు గల బ్యాక్టీరియా యోనిలో ఈస్ట్ బ్యాలెన్స్‌ని సమతుల్యం చేస్తుంది. ఈ బాక్టీరియా ఈస్ట్‌ను హతం చేసే హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. కావున ఇది శరీరంలో ఇన్ఫెక్షన్ల రేటుని నియంత్రిస్తుంది.
ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది : రోజూ పెరుగు తినడం వలన అందులో ఉండే కాల్షియం శరీరం లోనికి చేరి ఎముకలు దృఢంగా మారడానికి సహాయపడుతుంది. సాధారణ పెరుగులో ఎముకలను బలపరచడానికి ఉపయోగ పడే కాల్షియం ధాతువు ఉంటుంది.
Also Read: లిన్సీడ్ కేక్ తో ఎన్నో ప్రయోజనాలు