ఆరోగ్యం / జీవన విధానం

యాలకులు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

0

యాలకుల గురించి మనందరికీ తెలుసు. కానీ అవి చేసే మేలు గురించి చాలా తక్కువగా తెలుసు. వాటి గురించి మనం తెలుసుకుందాం..
యాలకులు మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. అధిక రక్తపోటు ను నియంత్రిస్తాయి. రక్తంలోని గడ్డలను నివారించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం, ఛాతీ మంట, చర్మ వ్యాధులు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి నోటి దుర్వాసనను తొలగిస్తాయి. శ్వాసలో తాజాదనాన్ని నింపుతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచుటకు సహాయపడతాయి. యాలకులలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. పలు రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. ఆస్తమా వ్యాధిని నిరోధించుటకు యాలకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి, ఊపిరితిత్తుల నిండా గాలిని ధారాళంగా పీల్చుకునేందుకు యాలకులు మంచిగా దోహదపడుతాయి. ఊపిరితిత్తుల్లోని ఇన్ ఫెక్షన్స్ను నివారిస్తాయి. ఒత్తిడిని, అలసటను తగ్గించుటకు యాలకులు చక్కగా పనిచేస్తాయి.

Leave Your Comments

పట్టు పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం

Previous article

మిద్దెతోట సాగులో అక్క చెల్లెళ్ళు ..

Next article

You may also like