ఆరోగ్యం / జీవన విధానం

క్యాబేజీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

0
Cabbage
Cabbage

క్యాబేజీ తినడాన్ని చాలా మంది ఇష్టపడరు. కానీ ఇందులోని పోషకాల గురించి తెలిస్తే మాత్రం వదిలిపెట్టరు. వీటిని పచ్చిగా గానీ, ఉడికించి గానీ తినవచ్చు. రెగ్యులర్ గా క్యాబేజీని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను అదుపులోకి తెచ్చుకోవచ్చు. విటమిన్ – సీ ఎక్కువగా వుండే క్యాబేజీ.. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గుండెజబ్బుల నుంచి రక్షిస్తుంది. అలాగే, విటమిన్ ఏ , రిబోఫ్లేవిన్, ఫోలేట్, బీ6, పీచుపదార్థాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. వీటిలో శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండి తద్వారా పాంక్రియాటిక్ గ్రంథి ప్రభావాన్ని తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో నిద్రపట్టేందుకు సహాయపడే లాక్ట్యుకారియం అనే పదార్థం ఉంటుంది.
క్యాబేజీలో అమినో యాసిడ్స్ గొప్పగా ఉండి యాంటీ ఇన్ఫలమేటరీగా పనిచేస్తుంది. మంటను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాదు పొటాషియం ఎక్కువగా ఉన్న క్యాబేజీని తీసుకోవడం వల్ల అధిక బరువు, కండరాల నొప్పులు తగ్గడంతో పాటు జుట్టు పెరుగుదలతో వృద్ధి ఉంటుంది. వీటిలో ఉండే బీటా కెరోటిన్ కంటెంట్ కండ్ల లోపల మచ్చల క్షణత నివారణకు సహాయపడుతుంది. కంటి శుక్లాలు రాకుండా దూరంగా ఉంచుతుంది. వీటిలో ముఖ్యంగా రెడ్ క్యాబేజీలో అల్జీమర్స్ నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. రెడ్ క్యాబేజీలో విటమిన్- కే అధికంగా ఉండటం వల్లనే అల్జీమర్స్ వ్యాధిని దూరం పెట్టొచ్చు. క్యాబేజీని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు.
క్యాబేజీలో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉండి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి వృద్ధాప్యం గుర్తులకు దారితీసే ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. కడుపులో లేదా కడుపు పూతలను నిర్మూలించాలంటే క్యాబేజీ తినాల్సిందే. క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్ లో యాంటీ అల్సర్ గుణాలు ఉంటాయి. పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీ ని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి. క్యాబేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలిన లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయమవుతుంది. దీనిలో ఉండే లాక్టిక్ ఆమ్లం గొంతు కండరాల సమస్య నుంచి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది.

Leave Your Comments

కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా జూలూరి గౌరీశంకర్ గారు రచించిన “ఒక్కగానొక్కాడు” పుస్తకాన్ని పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Previous article

జెమిని వైరస్ వలన ఖమ్మం జిల్లాలో మిరప రైతుల కన్నీళ్లు..

Next article

You may also like