ఆరోగ్యం / జీవన విధానం

మజ్జిగ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

0

మార్చి కూడా పూర్తి కాకుండానే ఎండలు ముదిరిపోతున్నాయి. అప్పుడే బయటకు వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండలను నిర్లక్ష్యం చేస్తూ బయట తిరిగితే అది ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. అందుకే ఎండాకాలంలో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చు. అలాంటి వాటిలో మజ్జిగ వాడకం ఒకటి. మజ్జిగ తాగేవారికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి తిరిగి తలెత్తకుండా ఉంటాయనీ, విషాదోషాలు, దుర్బలత్వం, చర్మ రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని మన ఆరోగ్య గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే మజ్జిగకు చాలా పురాణ చరిత్ర కూడా వుంది. దేవలోకంలో దేవతల కోసం అమృతాన్ని ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడట. అందుకే వేసవి కాలంలో మనం మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. తోడుపెట్టినందు వలన పాలలో వుండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా వుండటంతో పాటు అదనంగా లాక్టో బాసిల్లై అనే మంచి బాక్టీరియా మనకు దొరుకుతుంది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు. ఫ్రిడ్జ్ లో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది. అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది. అందుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది. వయస్సు పెరుగుతున్న కొద్ది మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. ప్రత్యేకించి వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగాలి. ఒక గ్లాస్ పాలు తీసుకుని కాచి చల్లార్చి అందులో రెండు గ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి ఈ పానీయాన్నీ కూర్చిక అంటారు. ఇందులో పంచదార, ఉప్పు బదులుగా ఈ క్రింది వాటిని కలపండి. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి. ఈ కూర్చికను తాగినప్పుడల్లా, అందులో ఈ మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి, వడదెబ్బ కొట్టాడు, పేగులకు బలాన్నిస్తుంది, జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది, వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది, వడదెబ్బ కొట్టని రసాల పానీయం ఇది. ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది కాబట్టి తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన వారికీ ఇచ్చే పానీయం ఇది.

Leave Your Comments

బ్రొకోలీ సాగుతో మంచి లాభాలు ఆర్జిస్తున్న యువరైతు..

Previous article

హైడ్రోపోనిక్స్ విధానంలో సాగు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి..

Next article

You may also like