వంకాయలను చాలామంది తినడానికి ఇష్టపడరు. అందుకు కారణం కొంతమందికి అలర్జీ లాగా ఏర్పడుతుంది. కొంతమందికి శరీరం దురద పెట్టడం లాంటివి జరుగుతుంటాయి. కొంత మంది వంకాయలను మరీ అమితంగా, వారికి ఇష్టం వచ్చిన వంటల రూపంలో తయారుచేసుకుని తింటూ ఉంటారు. వంకాయలలో కూడా అనేక రకాలు వున్నాయి. కొన్ని పొడవుగా, సొరకాయలాగా ఉంటే మరికొన్ని గుండ్రంగా ఉంటాయి. ఏది ఎలా ఉన్నా రుచి మాత్రం ఎప్పటికీ మారదు. వంకాయల్లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్, ఆంథో సయనిన్స్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. వంకాయలో వుండే సోలోసోడైన, రామ్మోసైల్, గ్లైకోసైడ్స్ అనబడే సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. కాబట్టి చాలా వరకు క్యాన్సర్ ను నివారించుకోవచ్చు. వీటిలో వుండే ఐరన్, కాల్షియంలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎముకలు ధృడంగా మారడానికి ఎముకల సాంద్రతను పెంచడానికి అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. వంకాయలో వుండే ఫైటో న్యూట్రియంట్స్, పొటాషియంలు మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంపొందించడం వల్ల ఫ్రీరాడికల్స్ నాశనం అవుతాయి. ఎప్పుడైతే రక్తనాళాలు నాశనమవుతాయో అప్పుడు మెదడులోని రక్త నాళాలు వెడల్పుగా మారుతాయి. మెదడుకు రక్త సరఫరా బాగా జరిగి, మెదడు యాక్టివ్ గా పనిచేస్తుంది.
వంకాయలలో సాపోనిన్ అనబడే సమ్మేళనం ఉండడంవల్ల శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. ఫలితంగా బరువు పెరిగే అవకాశం కూడా తక్కువ. వంకాయలను తినడం వల్ల వీటిలో వుండే ఐరన్, థయామిన్, నియాసిన్, కాపర్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ కె, పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరగడాన్ని ప్రోత్సహిస్తాయి.
వంకాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
Leave Your Comments