Bottle Gourd Juice: మనం ఎక్కువగా ఉపయోగించే కూరగాయలలో సొరకాయ ఒకటి. ఇది రుచితో పాటు అనేక పోషకాలు కలిగి ఉన్నాయి.అయితే ఆరోగ్యంగా ఉంచే ఈ సొరకాయ ను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూదాం.!
సొరకాయ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది . అందువల్ల చర్మాన్ని డిహైడ్రెషన్ బారిన పడకుండా చేస్తోంది.ఇది చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. స్కిన్ మరియు హెల్త్ గ్లోయింగ్ గా మారుస్తుంది.సొరకాయ ముక్కల్ని గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బాలి. తర్వాత సాల్ట్, జీరా పొడి,మిరియాల పొడి, పుదీనా ఆకులు వేసి బాగా మిక్స్ చేసి ఈ పనియాన్ని తయారు చేసుకోవాలి.
సొరకాయ విటమిన్ బి,విటమిన్ సి తో పాటు సోడియం, ఐరన్, జింక్,పోటాషియం ను కలిగి ఉంటాయి.ఇది అధిక మొత్తంలో నీటి శాతాన్ని మరియు తక్కువ కోలేస్ట్రాల్ ను కలిగి ఉంటుంది.
Also Read: Horse gram Health Benefits: కిడ్నీల్లో రాళ్లు కరగాలంటే ఇవి తినండి!!

Bottle Gourd Juice
రెగ్యులర్ గా సొరకాయ జ్యూస్ తాగడం వలన అనేక ఫలితాలు పొందవచ్చు. తక్కువ ఫ్యాట్ ఉండే ఈ పానీయాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వలన బరువు తగ్గించుకునేందుకు సహాయ పడుతుంది. ఇది శరీరంలోని ఏర్పడే వ్యర్థాలను తేలికగా బయటికి పంపడం ద్వారా బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. డయేరియాను నివారించడానికి సొరకాయ ఎంత గానో ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఇందులో నీటి శాతం మరియు మినరల్స్ ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటాయి.
సొరకాయ గుండెను ఆరోగ్యాన్నీ పెంచే జింక్ ను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని రక్త సరఫరా మెరుగుపరుస్తుంది.అధిక రక్త పోటును తగ్గించి గుండెకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.కంటి చూపును మెరుగు పరిచే విటమిన్ సి సొరకాయ లో పుష్కలంగా ఉంటాయి.కంటి చూపు సమస్యతో బాధ పడే వారు సొరకాయ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితాలు చూడవచ్చు.రక్త హీనత సమస్య తో బాధ పడే వారికీ సొరకాయ జ్యూస్ బాగా పనిచేస్తుంది.రక్త హీనత సమస్యలను దూరం చేస్తుంది.
Also Read: Green gram Health Benefits: ఆరోగ్యాన్ని పెంపొందించే పెసర్లు!!