ఆరోగ్యం / జీవన విధానం

తమలపాకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

0

ఆధునిక ప్రపంచంలో అందరూ పలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన జీవనశైలి, ఆహారం ప్రభావితం చేస్తున్నాయి. ఉరుకులు పరుగుల జీవితం వలన చిన్న సమస్యలు పెద్దగా మారేంత వరకూ కూడా మనం వాటిపై దృష్టి సారించడంలేదు. కానీ కొన్ని సమస్యలను మన ఇంట్లోనే పరిష్కారం చూపే ఔషధాలు ఉన్నా.. చాలా మంది వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. పెరట్లో ఉన్న మొక్కలతో మనం పలు రోగాలను ఇట్టే నయం చేసుకోవచ్చు. అలాంటి ఔషధాల్లో తమలపాకులు ఒకటి. వీటిల్లో కాల్షియం, ఇనుము, విటమిన్ సి, పీచు పదార్థాలు పుష్కలంగా వున్నాయి. ఆకలి నుంచి.. అరుగుదల వరకూ.. అనారోగ్య సమస్యలకు ఈ తమలపాకులు సంజీవనిలా ఉపయోగపడతాయి.
ఆకలి అనిపించినప్పుడు నోటికి రుచి లేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆకలి వేయకపోతే రెండు తమలపాకులు నమిలితే చాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
కడుపు ఉబ్బరంగా ఉంటే రెండు తమలపాకులు తీసుకుని చేతితో నలిపి వాటిని పాలలో కలుపుకుని తాగితే బ్లోటింగ్ సమస్య చిటికిలో తగ్గిపోతుంది. ఇలాచేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు.
తలనొప్పికి కానీ మైగ్రేన్ కి కానీ తమలపాకులు దివ్య ఔషధంలా పని చేస్తాయి. తరచూ ఈ సమస్య వేధిస్తుంటే నుదుటి మీద తమలపాకులను రాయడం కానీ.. లేకపోతే.. తమలపాకుల రసంతో కాసేపు మసాజ్ చేస్తే తలనొప్పి తగ్గుతుంది.
ప్రతిరోజూ తమలపాకులు తీసుకుంటూ ఉంటే మెంటల్ హెల్త్ చాలా బాగుటుంది. అలానే డిప్రెషన్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అరుగుదలకు తమలపాకు మేలు చేస్తుంది. జీర్ణప్రక్రియలో అరుగుదలకు సహకరించే యాసిడ్స్ ను ఉత్పత్తి చేయడానికి తమలపాకు సహకరిస్తాయి.
ఎప్పుడైనా చిన్న గాయాలు కానీ వాపు, నొప్పి కలిగితే తమలపాకులని నొప్పి ఉన్న చోట ఉంచాలి. వీటి రసంతో మసాజ్ చేస్తే నొప్పులు కూడా తగ్గుతాయి.
తమలపాకులు తినడం వల్ల కఫం రాదు. రోజూ తమలపాకులను తినడం ద్వారా దగ్గు, జలుబు సమస్యలకు కళ్లెం వేయవచ్చు.

Leave Your Comments

రైతులు కోళ్ల పెంపకంలో వేల ఆదాయం పొందవచ్చు..

Previous article

ఎక్కువ ధర రావాలంటే టమాటా సాగు ఎప్పుడు చేయాలి..

Next article

You may also like