Balamrutham Health Benefits: బాలామృతం” అనేది 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న పిల్లలకు మెరుగైన పౌష్ఠిక పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా ICDS పథకం ద్వారా ప్రవేశపెట్టారు. ఈ ఆహారం లో గోధుమలు, శనగ పప్పు, పాలపొడి, నూనె మరియు పంచదారలు ప్రధానంగా ఉంటాయి. ఇది పిల్లకు బలవర్థకమైనది.దీని నుండి పిల్లలకు రోజు వారి పోషక అవసరతలో 50% ఇనుము, కాల్షియం, విటమిన్లు మరియు ఇతర RDAలను తప్పకుండా అందిస్తుంది. బాలామృతం పిండి కూర్పు మరియు పోషక విలువలు వరుసగా టేబుల్-I మరియు IIలో నిక్షిపాపరచాము.
పిల్లలకు సిఫార్సు చేయబడిన పరిమాణం 100 గ్రాములు. దీనిని పిల్లలకు ప్రతిరోజూ 3-5 సార్లు అందించాలి. ఒక సంవత్సరం లోపు వయసు ఉన్న చిన్న పిల్లలకు, బాలామృతాన్ని వేడి నీటితో కలిపి పాయసంగా అందించవచ్చు. అదే పెద్ద వయస్సు ఉన్న పిల్లలకు “లడ్డూ” లాగా చేసి పెట్టవచ్చు.
Also Read: Business Woman: చక్కెరకు ప్రత్యామ్నాయం స్టెవియా సాగులో CEO స్వాతి విజయాలు
ఐసీడీఎస్ ద్వారా ఒక్కో చిన్నారికి నెలకు 2.5 కిలోలు అనగా ఒక ప్యాకెట్ బాలామృతం పంపిణీ ద్వారా అందచేస్తారు. దీనిని ప్రతి నెల ఒకటవ తేదీన న్యూట్రిషన్ హెల్త్ డే-1 రోజు 7 నెలలు మరియు 3 సంవత్సరాల వయస్సు మధ్య పిల్లలకు “టేక్ హోమ్ రేషన్”గా పంపిణీ చేస్తారు. బాలామృతం ప్యాకెట్‌తో సహా, పిల్లలకు ICDS ఫుడ్ మోడల్ కింద అంగాన్వాడి కేంద్రాలలో వారానికి 2 గుడ్లు 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లకు అందిస్తారు.ఈ వయస్సులో ఉండే పిల్లలకు బాలామృతం సమర్థవంతమైన పోషకాహారంగా ఉపయోగపడుతుంది. IYCF పద్ధతులపై పిల్లల తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే గాక దీర్ఘకాలిక పోషకాహార లోపాల గురించి అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది.
బాలామృతం కేవలం పిల్లల ఆహారంగా మాత్రమే కాకుండా, పోషకాహార లోపాన్ని తగ్గించడంలో క్యాలరీల అధిక సాంద్రత కలిగిన ఆహారం కావున, పోషకాహార లోపం ఉన్న పిల్లల మానసిక మరియు శారీరక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది.
Also Read: Gardening Tools: గార్డెనింగ్లో ఉపయోగించే గార్డెనింగ్ టూల్స్