అత్యంత ఆరోగ్యకరమైన ఆకుకూరల్లో తోట కూర ఒకటి. ఆకుకూరల్లో ప్రధానమైంది. మనదేశంలో ఎక్కువగా సాగు చేయబడుతున్న ఆకుకూర. తోటకూరలో ఎన్నో పోషకాలున్నాయి. ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికే కాదు. అందానికి కూడా తోటకూర ఉపయోగపడుతుంది. ఇక తోటకూరలో పులుసు, వేపుడు, పప్పు ఇలా రకరకాల కూరలను తయారు చేస్తారు. ఇక ఇది మంచి విరోచనకారి, ఆకలిని పుట్టిస్తుంది. జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాదు తోటకూర తింటే బరువు చాలా ఈజీగా తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు రోజు ఓ కప్పు తోటకూర వండుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. తక్షణశక్తిని తోటకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం. ఉడికించిన తోటకూరలో తేనె కలిపి గోధుమ రొట్టెతో తీసుకుంటే మలబద్దకం, గ్యాస్ట్రిక్, అల్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది.
తోటకూర హైబీపీని నియంత్రిస్తుంది. తోటకూరలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. అందులో ఉన్న ప్రోటీన్లు శరీరానికి అందుతాయి.
అంతేకాదు తోటకూర రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివి సమకూర్చుతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ తోటకూర తీసుకోవడం ద్వారా పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇది కళ్ళకు చాలా మంచిది. తోట కూరని సూర్యాస్తమయం తరువాత భూమి నుండి వేరు చేసి స్వీకరిస్తే దానిలో ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తుంది. తోటకూర ఎదుగుతున్న పిల్లలకు మంచి బలవర్థకమైన ఆహారం. ఒక కప్పు తోట కూర తీసుకుంటే అయిదు కోడి గుడ్లు, రెండు కప్పుల పాలు, మూడు కమలాలు, ఇరవై అయిదు గ్రాములు మాంసం, అయిదు యాపిల్స్ గాని తీసుకున్నంత ఉపయోగం కలుగుతుంది. తోటకూర ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి కూడా బాగా పనిచేస్తుంది. తోటకూర ఆకుల రసం ప్రతిరోజూ తలకు రాస్తే శిరోజాలు ఒత్తుగా, నల్లగా పెరుగుతాయి. తోటకూర రసంలో పసుపు కలిపి రాస్తే.. ముఖంపై మొటిమలు తగ్గుతాయి. ముఖ వర్చస్సు పెరుగుతుంది.
తోటకూర ఆరోగ్య ప్రయోజనాలు..
Leave Your Comments