ఆరోగ్యం / జీవన విధానం

జామ ఆకుల టీ – ఆరోగ్య ప్రయోజనాలు

0

చాలా మందికి జామ ఆకులతో టీ పెట్టుకోవచ్చని తెలియదు. ఈ టీ చేయడం చాలా తేలిక. ఎంతో ఆరోగ్యకరం. మరి ఎలా ప్రిపేర్ చెయ్యాలో తెలుసుకుందాం..
జామ ఆకుల సీక్రెట్ తెలిసిన కొంత మంది దశాబ్దాలుగా వాటితో టీ పెట్టుకొని తాగారు. కాలక్రమంలో రకరకాల కొత్త టీలు వచ్చాక ఈ టీ కనుమరుగైంది. ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. జామ ఆకుల టీ పొడిని గ్వావా గ్రీన్ టీ అని కూడా పిలుస్తున్నారు.
మీకు సొంతంగా టీ పెట్టుకొని తాగడం ఇష్టమైతే మీరు ఈ టీని టెస్ట్ చూడవచ్చు. జామ ఆకుల టీ అద్భుతంగా ఉండదు కానీ బాగానే ఉంటుంది. జామకాయల చెట్టు ఇంటి పెరట్లో ఉంటే దానికి ఉన్న ఆకులతోనే ఈ టీ చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
10 జామ ఆకులు, ఏదైనా టీ పొడి – పావు టీ స్పూన్, గ్లాస్ వాటర్, తేనె లేదా బెల్లం.
తయారీ విధానం:
ముందుగా 10 జామ ఆకులను శుభ్రంగా కడగండి. ఇప్పుడు టీ పాత్రలో నీరు పోసి ఉడకనివ్వండి. నీరు బుడగలు వస్తున్నప్పుడు జామ ఆకులు వెయ్యండి. ఆకులను ముక్కలు చేసి వేస్తే మంచిది. 5 నిముషాలు ఉడకనివ్వండి. నీరు రంగు, రుచికరమైన వాసన వచ్చే వరకూ ఉడకనివ్వండి. ఇప్పుడు ఇంకొంచెం నీరు పోసి 10 నిముషాలు ఉడకనివ్వండి. ఆ తర్వాత వడగట్టి ఒకటిన్నర టీ స్పూన్ తేనె లేదా బెల్లం వేసి కలిపి తాగండి.
జామ ఆకుల టీ ప్రయోజనాలు:
ఈ టీ లో రోగాలను నియంత్రించే గుణాలు ఉన్నాయి. అలాగే శరీరానికి చలవ చేసి వేడిని తగ్గిస్తుంది. మరో గుణం ఏంటంటే.. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించగలవని న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం అనే జర్నల్ లో తెలిపారు. ఐతే ఈ టీ ని వరుసగా 8 వారాలపాటూ రోజూ తాగాలి. అప్పుడే బరువు తగ్గుతారు. అలాగే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.

Leave Your Comments

ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రకృతి సేద్యం

Previous article

చేపల పెంపకంలో నీటి గుణాలు ప్రాముఖ్యత యాజమాన్య పద్ధతులు

Next article

You may also like