Stevia: ప్రస్తుత ఉరుకుపరుగుల కాలంలో బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి, అందులో షుగర్ ప్రధానమైనది. అయితే ఈ షుగర్ వ్యాధిగ్రస్థులను చక్కర మరియు ఇతర తియ్యని పదార్థాలు తినొద్దని అంటూ ఉంటారు, అలాగే టీలో కూడా చక్కెర వేసుకోకూడదు అని అంటూ ఉంటారు. కానీ వారికి కూడా షుగర్ వేస్కొని టీ తాగాలని ఉంటుంది కదా, అలాంటి వారి కోసమే ఈ “స్టీవియా” చక్కెరకు అద్భుతమైన ప్రత్యామ్న్యాయంగా ఉపయోగపడుతుంది. సాధారణంగా స్టీవియా అనేది తులసి జాతికి చెందిన మొక్క. దీనిని మధుపత్రి లేదా తియ్యని మొక్క అని కూడా పిలుస్తుంటారు. ఈ మొక్క యొక్క ఆకులు పంచదార కంటే 30 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటాయి. స్టీవియా క్యాలరీలను తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయిలు మరియు క్యావిటీస్ వంటి ప్రమాదాలను నివారించడంలో కూడా తోడ్పడుతుంది.
Also Read: Palm Toddy Benefits: ఎన్నో రకాల వ్యాధులను తరిమికొట్టే.. తాటి కల్లు ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
ఈ మధుపత్రి ఆకులలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇది అనేక అనారోగ్య సమస్యలను నివారించడంలో తోడ్పతుంది, అలాగే రోగనిరోధక శక్తి ని కూడా పెంపొందిస్తుంది. ముందు చెప్పినట్టుగా ఇది షుగర్ రోగులకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది, దాని కోసం ఈ మధుపత్రి ఆకులను ఎండబెట్టి, దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని టీలో, కషాయంలో లేదా మరే ఇతర పానీయాల్లో అయినా కలుపుకొని తాగవచ్చు. మాములుగా పంచదారతో షుగర్ రోగులకు అనేక ప్రమాదాలు ఉంటాయి, కానీ ఈ సహజమైన స్టీవియా తో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. కావున మధుమేహం ఉన్న వాళ్ళు ఈ మధుపత్రిని నిర్భయంగా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మధుపత్రిని మీ డైట్ లో చేర్చుకుంటే ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్ గుణాలు కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో కూడా తోడ్పడుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది రక్తపోటును కూడా తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. చిన్న పిల్లలు తినే ఆహారంలో దీన్ని చేర్చితే ఉత్తమం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ఈ మధుపత్రి క్యావిటీస్ ప్రమాదాన్ని నివారించి పళ్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
Also Read: Sorrel Fruit Benefits: గోంగూర కాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా?… అయితే ఇది మీ కోసమే!