ఆరోగ్యం / జీవన విధానం

Goji Berries Health Benefits: గోజీ బెర్రీలతో ఆరోగ్య ప్రయోజనాలు

0

Goji Berries Health Benefits: గోజీ బెర్రీల గురించి మీలో ఎంతమందికి తెలుసు. చాలామందికి వీటి గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇవి సూపర్ టేస్ట్ ఉంటాయి. ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వయస్సు పైబడినవారే కాదు.. యంగ్ ఏజ్‌లో ఉన్నవారిని సైతం ఇప్పుడు కంటి చూపు సమస్యలు వెంటాడుతున్నాయి.

ఇలా ఇబ్బందులు పడుతున్నవారు గోజి బెర్రీలను డైట్‌లో చేర్చుకోవడం చాలా బెటర్. ‘డ్రైడ్ గోజి బెర్రీస్’ అని సెర్చ్ చేస్తే.. ఇవి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. డ్రై ఫ్రూట్స్  మాదిరి వీటి ధర కాస్త ఎక్కువే ఉంటుంది. కేజీ క్వాలిటీని బట్టి రూ.1500 వరకు ఉంటుంది. లైసియం చినెన్స్, లైసియం బార్బరమ్ అని పిలిచే రెండు రకాల పొదలకు ఈ పండ్లు కాస్తాయి. వీటిని ఎండబెట్టి డబ్బాల్లో స్టోర్ చేస్తారు. చైనీయులు దీన్ని చిరుతిండిగా ఉపయోగిస్తారు. సూప్‌లో వేసుకుని తింటారు.

Also Read: స్ట్రాబెర్రీ సాగు విధానం… ప్రయోజనాలేంటి…?

అరటిపండు మాదిరిగా వీటిని తిన్న వెంటనే ఎనర్జీ లభిస్తుంది. వీటి ద్వారా శరీరానికి జియాక్సంతిన్ లభిస్తుంది. టిబెట్ (Tibet), చైనా (China)లలో ఈ ఫ్రూట్స్ ఎక్కువగా పండుతాయి. అందుకే ఈ ఫ్రూట్స్‌ను హిమాలయన్ గోజి, టిబెటన్ గోజి అని కూడా పిలుస్తారు. రోజుకో పది ఎండు గోజి బెర్రీలను తింటే కంటి సమస్యలు మటుమాయం అవుతాయని చైనీయులు చెబుతారు. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో కూడా గోజి బెర్రీల వల్ల కలిగే లాభాల గురించి ఓ అధ్యయనం ప్రచురితమైంది.

ఎండిన గోజీ బెర్రీలను క్రమం తప్పకుండా తింటే సైట్ రావడం,  కళ్లల్లో మచ్చలు రావడం, ఇతర దృష్టి లోపాలు రాకుండా అడ్డుకుంటుందట.  గోజీబెర్రీలలో ఉండే లుటీన్, జియాక్సంతిన్లు హానికరమైన నీలి  కాంతిని ఫిల్టర్ చేసి యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందిస్తాయి. ఇక క్యాన్సర్, గుండె సంబంధిత రోగాల నుంచి కూడా గోజీ బెర్రీలు రక్షణ ఇస్తాయని అధ్యయనంలో పేర్కొన్నారు.

Also Read: స్ట్రాబెర్రీస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Leave Your Comments

Ragi Health Benefits: రాగితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Previous article

Sprinkler Irrigation: స్ప్రింక్లర్ ఇరిగేషన్ తో నీటి మరియు కలుపు సమస్యలకు చెక్

Next article

You may also like