చలికాలం ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో శిశిర ఋతువులో చర్మం కూడా పొడిబారుతుంటుంది. ఈ సమయంలో చర్మ సౌందర్యానికి రెజ్యూవినేషన్ థెరపీలు ఉపయోగపడుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పైపూతలు సరిపోవు. నెయ్యి తప్పనిసరిగా తీసుకోవాలి. దీనిలోని బ్యుటిరిక్ ఆమ్లం, లారిక్ ఆమ్లం, ఒమేగా 3 బరువు తగ్గడానికి, చర్మ ఆరోగ్యానికి, ఒత్తిడి తగ్గించడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి, రక్తంలో కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉండటానికి సహకరిస్తుంది.
తెలివి తేటలు, జ్ఞాపకశక్తి పెరగడానికి కూడా నెయ్యి ఉపయోగపడుతుంది. వేపుళ్ళు, బర్గర్లు, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ బదులు నెయ్యితో చేసిన పదార్థాలు తీసుకోవడం మేలు. జీవనశైలిలో మార్పుతో శారీరక, మానసిక ఆరోగ్యం సొంతమవుతుంది.
Leave Your Comments