ఆరోగ్యం / జీవన విధానం

కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తరువాత తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు..

0

కోవిడ్ -19కి విరుగుడుగా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.. ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఏం తింటే వ్యాక్సిన్ ప్రభావం తగ్గుతుందో, ఏం తింటే వ్యాక్సిన్ ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుందోననే సందేహం చాలామందిలో ఉంది..
ఇప్పటికే కొన్ని మిలియన్ల మంది జనాభా కోవిడ్ – 19 వ్యాక్సిన్ తీసుకోగా ఇంకా ఎంతో మంది కరోనా వ్యాక్సిన్ కోసం క్యూలో వేచిచూస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వాళ్లంతా వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేయడం కోసం ఆహారంగా ఏం తీసుకుంటే బాగుంటుంది.. వేటికి దూరంగా ఉంటే బాగుంటుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
నీరు ఎక్కువగా తీసుకోవాలి. కోవిడ్ – 19 వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండి నీరసం దరిచేరనివ్వదు. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. అందుకే నీరు తాగడం మర్చిపోవద్దు.
ఆల్కహాల్ తీసుకోకూడదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అన్నింటికి మించి మద్యం అలవాటు అనేది వ్యాధినిరోధక శక్తి నశించేలా చేస్తుంది. శరీరం డీహైడ్రేట్ అయినా లేదా వ్యాధినిరోధక శక్తిని కోల్పోయినా అది కోవిడ్ -19 టీకా పనితీరుపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా జ్వరం, ఒళ్లునొప్పులు, కళ్ళు తిరగడం, నీరసం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కాకుండా హోల్ గ్రెయిన్ ఫుడ్స్ తినాలి. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెల్దీ బాడీ కోసం హెల్దీ ఫుడ్ తప్పనిసరి. అందుకే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు అంతకంటే ముందు ఆ తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా హోల్ గ్రెయిన్ ఫుడ్స్ తీసుకోవాలి. ప్రాసెసింగ్ చేసిన వాటిలో కొవ్వు, కెలరీలు అధికంగా ఉండనుండగా హోల్ గ్రెయిన్ ఫుడ్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది.
ఫైబర్ ఫుడ్స్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యాధి నిరోధక శక్తి పెరగడం కోసం శరీరానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అవసరం. క్లినికల్ స్లీప్ మెడిసిన్ అనే జర్నల్ లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం కొవ్వు, షుగర్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి నిద్రలేమికి కూడా దారితీస్తుంది. అదే కానీ జరిగితే అది మీరు తీసుకునే కోవిడ్ – 19 వ్యాక్సిన్ పనితీరు కూడా నెమ్మదిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
కోవిడ్ -19 వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన చాలా మందిలో కలిగిన కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అవి బలహీనత, కళ్ళు తిరగడం వంటి లక్షణాలే. అలా కాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, తీసుకున్న తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఫైబర్ అధికంగా ఉండే పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం మంచిది.

Leave Your Comments

కొర్ర బియ్యం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

వానపాములతో వర్మి కంపోస్ట్

Next article

You may also like