Flax మనకు తినేందుకు అనేక రకాల పోషకాహారాలు అందుబాటులో ఉన్నాయి. అనేక నట్స్, విత్తనాలను మనం రోజూ తినవచ్చు. అయితే వాటిల్లో అవిసె గింజలు కూడా ఒకటి. చాలా మంది వీటిని తినేందుకు సందేహిస్తుంటారు. కానీ అవిసె గింజలు అద్భుతమైన పోషకాహారం అని చెప్పవచ్చు. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవిసె గింజలను రోజూ గుప్పెడు మోతాదులో తింటే అనేక లాభాలను పొందవచ్చు.
- అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపులను తగ్గించడంలో పనిచేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. హైబీపీ తగ్గుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా గుండె సురక్షితంగా ఉంటుంది.
- అవిసె గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. దీని వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
- అవిసె గింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బి విటమిన్లు, మెగ్నిషియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ గింజలను రోజూ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
- అవిసె గింజల్లో లిగ్నన్స్ అని పిలువబడే పోషకాలు ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక అవిసె గింజలను రోజూ తింటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీని వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
- అధిక బరువు తగ్గాలనుకునే వారికి అవిసె గింజలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. అందువల్ల బరువు తగ్గుతారు.
- అవిసె గింజలు మహిళల ఆరోగ్యం కోసం కూడా ఎంతో పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల మహిళల్లో సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి. నెలసరి సరిగ్గా వస్తుంది.
- చేపలను తినలేమని అనుకునేవారు అవిసె గింజలను తినవచ్చు. ఎందుకంటే చేపల్లో ఉండే పోషకాలన్నీ దాదాపుగా ఈ గింజల్లోనూ ఉంటాయి. కనుక వీటిని తింటే చేపలను తినాల్సిన అవసరం ఉండదు. పోషకాలన్నీ లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.
అవిసె గింజలను గుప్పెడు మోతాదులో తీసుకుని పెనంపై వేయించి తినవచ్చు. సాయంత్రం సమయంలో జంక్ ఫుడ్‌కు బదులుగా వీటిని తింటే మేలు జరుగుతుంది. అలాగే అవిసె గింజలను పొడి చేసి కూడా తీసుకోవచ్చు.
Leave Your Comments