Yogaasana For Farmers: ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నిర్వహించిన పరిశోధన ప్రకారం, 74 శాతం మంది మహిళలు మరియు 80 శాతం మంది పురుషులు ఎక్కువగా పనిలో మునిగిపోవడం వలన మరియు తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వలన భారీ ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించారు . ఈ ఒత్తిడి మూలాన చాలా మంది రాత్రిపూట నిద్రని కోల్పోతున్నారు. కావున ఈ ఒత్తిడి నుండి ఉపశమనం పొందడం కోసం, ప్రజలు టీ కి అలవాటు పడిపోవడం, సౌండ్ థెరపీ మరియు స్పా చికిత్సలు వంటి కొత్త మార్గాలను వెతుకుంటున్నారు. అయితే ఇవన్నింటి కన్నా ఒత్తిడిని అధిగమించడానికి మనకు తెలిసిన పురాతనమైన మార్గం యోగా.
తరచూ యోగా చేయడం వలన రక్తపోటును తగ్గిస్తుంది మరియు డిప్రెషన్ ఆందోళనకు గురికాకుండా ఉపశమనాన్ని అందిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడే యోగా ఆసనాల గురించి తెలుసుకుందాం!
Also Read: Theraupic Yoga Practices: ఒత్తిడిని జయించే థెరప్యూటిక్ యోగా
1. సుఖాసన (సులభమైన భంగిమ): సుఖాసనం చేయడం వలన వెన్నెముకను పొడిగిస్తుంది. ఇది మనను శాంతింపరచడానికి మరియు ఆందోళనను తొలగించడానికి సహాయపడుతుంది. ఇంతే కాకుండా మానసిక మరియు శారీరక అలసటను కూడా తగ్గిస్తుంది.
2. బాలసనా (పిల్లల భంగిమ): ఈ ఆసనం మన శోషరస వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థకు చాలా ప్రయోజనకరం. ఇది మన మనస్సును శాంతపరుస్తుంది మరియు ఒత్తిడిని తొలగిస్తుంది. ఈ భంగిమ తొడలు, తుంటి మరియు కాళ్ళను సాగదీస్తుంది. మరియు మెడ ,వెన్నునొప్పిని తగ్గిస్తుంది.
3. పశ్చిమోత్తనాసనం (కూర్చుని ముందుకు వంగే భంగిమ): పశ్చిమోత్తనాసనం వెన్నెముక్కను, స్నాయువు మరియు వీపును సాగదీస్తుంది.ఈ భంగిమ కేవలం ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కాలేయాన్ని ఆరోగ్యం గా చేస్తుంది, అలసటను తగ్గిస్తుంది మరియు రుతువిరతి లక్షణాలను తగ్గిస్తుంది.
4. ఆనంద బాలసన (సంతోషంగా ఉన్న శిశువు భంగిమ): ఆనంద బాలసన చేయడం వలన మనకు ప్రశాంతతను కలిగిస్తుంది మరియు అలసట, ఒత్తిడిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది వెన్నెముక్కను కూడా సాగదీస్తుంది.
5. ఉత్తనాసనం (ముందుకు వంగడం): ఈ ఆసనం చేయడం వలన తేలికపాటి నిరాశను మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మెదడుకు ప్రశాంతతను మరియు కిడ్నీలను, కాలేయాన్ని ఉత్తేజపరుస్తుంది. ఈ భంగిమ మోకాళ్లను బలపరుస్తుంది.
Also Read: Yoga: మంచి జీవన విధానం యోగాతో సాధ్యం