Egg Bad Combinations: సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా మారవచ్చనే విషయం మనందరికి తెలిసిందే. కాని ఏదైనా ఆహార కలయిక తప్పుగా ఉంటే, అది శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. దీనికి ఒక కారణం మన బిజీ బిజీ జీవన శైలి. ఆయుర్వేదం ప్రకారం, ఇలా తప్పుడు ఆహార కలయికలు తినడం వలన జీర్ణవ్యవస్థ పై ప్రభావం చూపుతుంది, అలసట, వికారం మరియు ప్రేగు వ్యాధులకు కూడా దారితీస్తుంది.

Egg Bad Combinations
Also Read:
ప్రజలు సాధారణంగా తీసుకునే ఆహారాలలో ఒకటి గుడ్డు.ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని, బోలేడన్ని పోషకాలు ఉంటాయని మనకు తెలిసిందే!గుడ్డులో ప్రోటీన్ లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి ఇంకా గుడ్డు తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారంగా ప్రసిద్ధి చెందింది.ఇందులో ఉండే ప్రోటీన్లు కండరాలను దృఢంగా మార్చుతాయి, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. గుడ్డును అనేక వంటకాల తయారీలో ఉపయోగిస్తారు.గుడ్డును వివిధ రూపాల్లో తింటారు.కొంతమంది ఉడికించిన గుడ్డును తినడానికి ఇష్టపడతారు, మరికొందరు మాంసాలు, పాల ఉత్పత్తులు మరియు కెఫిన్ పానీయాలతో తింటారు. గుడ్లతో తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి మనం తెలుసుకుందాం!
గుడ్డు, బేకన్: గుడ్డు, బేకన్ అనేది చాలా మంది ప్రజలు ఎంతో రుచిగా ఉంటుందని చాలా ఉత్సాహంతో తింటూ ఉంటారు. కాని ఈ రెండింటినీ కలిపి తినడం వలన కలిగే ప్రమాదం ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ రెండు ఆహార పదార్థాల్లో అధిక మొత్తంలో ప్రొటీన్లు, కొవ్వులు ఉంటాయి. దీని కారణంగా మనలో ఉండే శక్తి నశించి , అలసటను కలిగిస్తుంది.
సోయా పాలు, గుడ్డు:
సోయాబీన్స్ నుంచి సోయా పాలను తయారు చేస్తారు. ఆవు పాలలో లభించే దాదాపు అన్ని పోషక విలువలు ఈ పాలలో కూడా ఉంటాయి. గుడ్డు , సోయా పాలను విడివిడిగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వీటిని కలిపి తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సోయా పాలలో ట్రిప్సిన్ ఇన్హిబిటర్ ఉంటుంది. దీని కారణంగా మన శరీరం ప్రొటీన్లను తక్కువగా తీసుకుంటుంది. గుడ్డు తెల్లసొనలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. ఈ రెండు రకాల ప్రోటీన్లు కలుస్తే మన శరీరం ప్రోటీన్లను తక్కువగా తీసుకుంటుంది తద్వార మన శరీరానికి సరైన పోషకాలు అందక నీరసానికి గురిచేస్తుంది.
టీ, గుడ్డు:టీ, కోడి గుడ్డును ఎంతో మంది చాలా ఇష్టంతో తింటారు. వాస్తవానికి ఈ రెండూ కలిపి తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇలా తింటే మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
పొట్లకాయ, గుడ్డు:పొట్లకాయ, కోడి గుడ్డును కలిపి తింటే జీర్ణ సంబంధ వ్యాధులు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొడి గుడ్డులో ప్రోటీన్లు అధిక శాతంలో ఉంటాయి కావున జీర్ణం అవడానికి చాలా సమయం పడుతుంది. పొట్ల కాయలో నీటి శాతం ఎక్కువ ఉండటం వలన చాలా సులభంగా జీర్ణమవుతుంది. ఈ రెండూ కలిసి తింటే జీర్ణ వ్యవస్థలో యాసిడ్ విడుదలై గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు.
పండ్లు ,గుడ్డు:మన ఆరోగ్యానికి పండ్లు చాలా మంచివి. అయితే గుడ్లతో కలిపి తినకూడదు. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
గుడ్లు ,చక్కెర:చెక్కర సంబంధిత వస్తువులను గుడ్లతో కలిపి తినకూడదు.ఎందుకంటే ఈ రెండింటిలో ఉండే అమైనో ఆమ్లాలు మన శరీరంలోని రక్తాన్ని గడ్డ పరుస్తుంది.తద్వారా అది విషంలా మారే అవకాశం ఉంది.
Also Read: