ఆరోగ్యం / జీవన విధానం

Effect of Egg white on Hair Fall: హెయిర్ ఫాల్ పై ఎగ్ వైట్ యొక్క ప్రభావం!

2
Egg white on Hair Fall
Egg white on Hair Fall

Effect of Egg white on Hair Fall: వెంట్రుకలు.. మనం అందంగా కనిపించడానికి కీలక పాత్ర పోషించడంలో మొదటి స్థానంలో ఉంటాయి.అయితే వీటిని ఆడవారు మగవారు అనే తేడా లేకుండా ఎవ్వరైనా కావాలనుకుంటారు. కానీ ఇప్పుడున్న కాలంలో హెయిర్ ఫాల్ (జుట్టు రాలడం) అనేది ప్రతి ఒక్కరికి ఒక సాధారణ సమస్యలా మారింది. జుట్టు రాలడం అనేది ప్రాణాంతక పరిస్థితి కాదు. అయితే మీరు ఈ జుట్టు అనేది లేకుండా ఎలా కనిపిస్తారో అనే భావన మీ ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. పురుషులు, మహిళలు మరియు పిల్లలు కూడా జుట్టు రాలడాన్ని అనుభవించవచ్చు. ఈ పరిస్థితి సాధారణంగా హార్మోన్ల మార్పులు, వంశపారంపర్యత, వైద్య పరిస్థితులు లేదా కొన్ని మందుల దుష్ప్రభావం ఫలితంగా సంభవిస్తుంది. వంశపారంపర్య కారణాల వల్ల జుట్టు రాలడం అనేది సాధారణ కారణం. అయితే ఈ జుట్టు రాలే సమస్యను మనం ఇంట్లోనే కూర్చొని చాలా రకాలుగా నయం చేస్కోవచ్చు…. అందులో ఒకటైన ఎగ్ వైట్ (గుడ్డులోని తెల్లసొన) జుట్టుపై ఎలా ప్రభావం చూపుతుందనేది మీ ముందుకు తీస్కోచ్చాము.

Also Read: Egg Bad Combinations: గుడ్డుతో కలిపి వీటిని తింటున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్టే సుమా.!

Effect of Egg white on Hair Fall

Effect of Egg white on Hair Fall

సాధారణంగా జుట్టు పెరుగుదలలో విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ల లోపం జుట్టు రాలడానికి సంబంధించిన అనేక సమస్యలను కలిగిస్తుంది. నియాసిన్ (Niacin) లేదా విటమిన్ బి 3 మరియు బయోటిన్ (Biotin) లోపం జుట్టు రాలడానికి దారితీస్తాయి. శరీరంలో విటమిన్ డి (Vitamin D) లోపం జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుందని కొన్ని ఆధారాలు చూపిస్తున్నాయి. జుట్టు రాలడం ఉన్నవారికి ఇతర వ్యక్తులతో పోలిస్తే విటమిన్ డి తక్కువ స్థాయిలో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. గుడ్డులోని తెల్లని సొన మన జుట్టుకి కావాల్సిన ప్రోటీన్లను కలిగి ఉంటుంది. గుడ్డులోని తెల్లసొనను నేరుగా మీ జుట్టుపై ఉపయోగించడం అనేది రూపాన్ని మెరుగుపరచడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి తక్కువ ఖర్చుతో కూడిన మార్గంగా ఉపయోగపడుతుంది.

మనం గుడ్డును తెరిచినప్పుడు, రెండు వేరు వేరు భాగాలను చూస్తాం: పసుపు గుడ్డు పచ్చసొన (Egg Yolk) మరియు గుడ్డు తెల్లసొన (Albumen). పచ్చసొనలో గుడ్డులోని అన్ని కొవ్వులు ఉండగా, గుడ్డులోని తెల్లసొనలో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది.గుడ్డు తెల్లసొన అనేది అన్ని ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలను(Amino acids) కలిగి ఉన్న పూర్తి ప్రోటీన్లతో కూడిఉంటుంది . మనకు జుట్టుతో సహా మన శరీరంలోని కణజాలాలను నిర్మించడానికి, నిర్వహించడానికి మరియు భర్తీ చేయడానికి ఆహారంలో ఈ ప్రోటీన్ అవసరం. అలాగే గుడ్డులోని తెల్లసొనను ప్రోటీన్ వనరుగా ఉపయోగించడంలో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. మీరు గుడ్లు తీసుకున్నప్పుడు ఎలర్జీ లాంటివి వ్యాపిస్తే మీరు ఈ గుడ్డులోని తెల్లని సొనని తలకి కానీ మిగతా ఏ శరీర అవయవాలకు కూడా ఉపయోగించవద్దు.

Also Read: Chicken Breeds for Meat and Eggs: అధిక గ్రుడ్లు మరియు మాంసం ఇచ్చే లేయర్, బ్రాయిలర్ కోళ్ళ రకాలు.!

Leave Your Comments

Hazards of Drinking Tea/Coffee in paper Cups: పేపర్ కప్పుల్లో టీ/కాఫీ తాగుతున్నారా? అయితే ఇది మీ కోసమే!

Previous article

Tinospora Cordifolia: తిప్పతీగలోని ఔషధ గుణాలు.!

Next article

You may also like