ఆరోగ్యం / జీవన విధానంవార్తలు

రోజూ నాలుగు వాల్‌నట్స్‌ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు !

0
  •   ప్రతి రోజూ ఉదయాన్నే మనం తీసుకునే ఆహారంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి మేలుచేసే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వాల్ నట్స్ ను ఆక్రోట్స్ అని కూడా పిలుస్తారు. సూపర్ ఫుడ్ గా పిలిచే వాల్ నట్స్ (ఆక్రోట్లు)ను ప్రతి రోజూ ఉదయం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో చాలా పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
    వాల్ నట్స్ లో వృక్ష సంబంధ ఒమేగా 3 కొవ్వు ఆమ్లం ఎక్కువగా ఉండడంతో శాఖాహారులకు చాల మంచివి. రోజుకు నాలుగు వాల్ నట్స్ తింటే మాంసాహారంలో మాదిరిగా ప్రొటీన్, చేపల్లో మాదిరిగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శాకాహారులకు వీటిలో లభిస్తాయి. పీచు, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము, రాగి, సెలీనియం వంటి పోషకాలు కూడా వీటిలో ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్, ఊబకాయం, మధుమేహం,పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, గుండెజబ్బుల వంటి ఎన్నెన్నో సమస్యలు దరిజేరకుండా కాపాడతాయి. అక్రోట్లతో విషయగ్రహణ సామర్థ్యం  మెరుగవుతుంది. సంతాన సమస్యలు తగ్గిస్తాయి. రోజూ అక్రోట్లను తినే మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపడి, సంతానం కలగటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వాల్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అనేక ప్రయోజనాలు ఉన్నందు వల్లనే వాల్ నట్స్ ను డ్రైఫ్రూట్స్ లో సూపర్‌ఫుడ్‌ అని కూడా పరిగణిస్తుంటారు.
    వాల్ నట్స్ ను పచ్చిగా తినడానికి బదులు రాత్రి నానబెట్టి ఉదయాన తింటే దాని ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి. రోజూ 2 నుంచి 3 వాల్ నట్స్ తినేవారిలో టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నట్స్‌ అన్నింట్లో కల్లా వాల్‌నట్స్‌ బలమైన ఆహారం. రోజుకు నాలుగు వాల్‌నట్స్‌ నానబెట్టి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
  • వాల్‌నట్లలోని ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి బాగా ఉపయోగపడుతాయి. ఏకాగ్రతను పెంచుతాయి. అల్జీమర్స్‌, డిమెన్షియా వచ్చే అవకాశం తగ్గిస్తాయి. వీటి ఆకృతి కూడా మనిషి మెదడును పోలి ఉంటుంది.
  • వాల్‌నట్స్‌లో విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, సోడియం, కాపర్‌, ఐరన్‌, మాంగనీస్‌ వంటి పోషకాలతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌ కూడా సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రోజూ వీటిని  తింటే రక్తహీనత దూరమవుతుంది.
  • వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉండే  పీచుపదార్థం జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అలాగే ప్రీబయోటిక్‌ కాంపౌండ్స్‌ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి.
  • పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల కడుపును నిండుగా ఉంచి, ఆకలిని తగ్గిస్తుంది.  ఇది బరువును అదుపులో ఉంచుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
  • వాల్‌నట్స్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. రోజూ వీటిని తింటే ఆర్థ్రయిటిస్ తో వచ్చే నొప్పులు, వాపులు క్రమంగా తగ్గుతాయి.
  • ఉదయాన్నే వాల్‌నట్స్ తినడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. వీటిలో ఉండే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. తద్వారా గుండెకు మేలు చేస్తుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందిస్తాయి.
  • వాల్‌నట్స్‌లో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరాన్ని దృఢంగా ఉంచడంలో మేలు చేస్తుంది. ఎముకలను, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే వాల్‌నట్స్‌ తినడం వల్ల వీటిలో పుష్కలంగా ఉండే కాల్షియం, మెగ్నీషియం వల్ల ఎముకలు దృఢంగా ఉంచేందుకు ఇవి మేలు చేస్తాయి.
  • ప్రతిరోజూ వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది.
  • మలబద్ధకం వంటి సమస్యలున్న వారు వాల్ నట్స్ తీసుకోవడం మంచిది. దీనిలో పొటాషియం, జింక్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండడంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
Leave Your Comments

డిజిటల్‌ వ్యవసాయ విస్తరణలో నూతన ఆవిష్కరణ

Previous article

You may also like