ఆరోగ్యం / జీవన విధానం

ఎండాకాలంలో ఈ పండ్ల జ్యూస్ లు తాగాలి..

0

ఎండాకాలం రానే వచ్చింది. ఇప్పటికే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. మండుటెండలో బయటకి వెళ్తే శరీరం ఒక్కసారిగా కందిపోతుంది. శరీరంలో నీటిస్థాయి, పోషకాలు తగ్గడంతో తొందరగా అలసటకు లోనవుతున్నాం. అందుకే ఎండాకాలంలో జ్యూస్ ఎక్కువగా తాగాలని.. దీంతో మీకు ఇన్ స్టెంట్ ఎనర్జీ దొరుకుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం కోల్పోయిన నీటి నిల్వలను, పోషకాలను కొన్ని రకాల పండ్లతో తిరిగి పొందవచ్చన్నారు. బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని .. శరీరం నిర్జలీకరణమైనప్పుడు తప్పనిసరిగా ఈ పండ్ల జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పుచ్చకాయ:
సీజన్ కు సంబంధం లేకుండా దొరికే ఫ్రూట్స్ లో పుచ్చకాయ ఒకటి. దీనికి డిమాండ్ మాత్రం ఎండాకాలంలోనే పెరుగుతుంది. పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. ఎండలో దాహం తీర్చకోవాలని అనుకుంటే పుచ్చకాయ జ్యూస్ తాగండి. దీంతో మీకు దాహం తీరడంతోపాటు తొందరగా శక్తిని చేకూర్చుతుంది. పుచ్చకాయ జ్యూస్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు ఏ, సి, బి6 పుష్కలంగా ఉంటాయి. జుట్టు, చర్మం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపర్చడంతో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే పుచ్చకాయలో ఉండే పీచుపదార్థం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది.
దోసకాయ:
ఎండాకాలంలో శరీరానికి చలువనిచ్చే పండ్లలో కీరదోస ఒకటి. ఇందులో 95 శాతం నీరు ఉంటుంది. కీరాను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేయడం, మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా చూడటం, ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు దోహదపడుతుంది. ప్రతిరోజు కీరా తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
స్ట్రాబెర్రీ:
స్ట్రాబెర్రీలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి, నీరు దొరుకుతుంది. ఇందులో 91 శాతం నీరు ఉంటుంది. పీచుపదార్థాలతోపాటు ఏ,సి,బి6, బి9, ఈ, కె విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ పండ్లు తినడం వల్ల రక్తంలోని కొవ్వును కరిగిస్తుంది. వీటితోపాటు ఖర్బుజా, బత్తాయి, ఫైనాపిల్ పండ్ల రసాలు శరీరానికి దాహం తీర్చడంలో తోడ్పడతాయి. వీటితో ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అయితే వీటి జ్యూస్ తీసుకున్నప్పుడు జ్యూస్ లో చక్కెర, ఐస్ వేసుకోకుండా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Leave Your Comments

అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతు వినూత్నపరిష్కారం..

Previous article

కొమ్మ కొమ్మకు కాయలు గుత్తులు, గుత్తులుగా ఆకులకంటే కాయలే..వాటర్ ఆపిల్

Next article

You may also like