Coconut Milk Health Benefits: ఎండలు భగ భగ మండుతున్నాయి. భానుడి తాపాన్ని తట్టుకోవడానికి వేసవిలో కొబ్బరి నీళ్లు తాగుతూ ప్రజలు సేద తీరుతున్నారు. వీటి ద్వారా అనేక పోషకాలు లభిస్తున్నాయి. అయితే కొబ్బరి నీళ్లు వలన కాకుండా కొబ్బరి పాలు తాగడం వలన కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా కొద్దిమందికే తెలుసు. అంతేకాకుండా వేసవిలో కొబ్బరి పాల వలన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు కూడా. కొబ్బరి పాల ద్వారా అనేక పోషకాలు లభిస్తాయి. అయితే కొబ్బరి పాల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
కొబ్బరి పాలు తయారీ విధానం: తురిమిన కొబ్బరిలో నీటిని పోసి, ఆ యొక్క మిశ్రమాన్ని మిక్సీ పట్టిన తర్వాత వడకట్టి కొబ్బరి పాలను తీయాలి. ఈ కొబ్బరి పాలల్లో పోషకాల శాతం చాలా పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా B1, B3, B5, B6, మెగ్నీషియం, భాస్వరం సంమృద్ధిగా లభిస్తున్నాయి.
Also Read: Coconut: కుటీర పరిశ్రమలలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల పాత్ర
కొబ్బరి పాలు ఉపయోగాలు:
- మెగ్నీషియం, భాస్వరం కొబ్బరి పాలల్లో ఉండటం వలన ఎముకలు ధృఢంగా తయారవుతాయి.
- కొలెస్ట్రాలను నియంత్రించడం లో కొబ్బరి పాలు చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. కొబ్బరి పాలల్లో కొవ్వుని కరిగించే పోషకాలు అధికంగా ఉన్నాయి. వీటిల్లో లారిక్ యాసిడ్ ఉండటం వలన మంచి కొలెస్ట్రాల్ పరిమాణం అభివృద్ధి చెందుతుంది.
- కొబ్బరి పాలల్లో రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉన్నాయి కాబట్టి శరీరంలో ఉండే వైరస్లు, బాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడతాయి.
- కొబ్బరి పాలల్లో మెగ్నీషియం పరిమాణం కాస్త అధిక మోతాదులో ఉండటం వలన కండరాలు బలంగా ఉంచడంలో సహాయపడతాయి.
- కొబ్బరి పాలల్లో ఫైబర్ శాతం ఎక్కువ ఉండటం వలన శరీరంలో ఉన్న కొవ్వుని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివలన బరువు తగ్గవచ్చు.
- తాజా కొబ్బరి పాలని జుట్టుకి పట్టించి కాసేపు మర్దనా చెయ్యాలి. ఇలా చెయ్యడం వలన జుట్టు బలంగా మారుతుంది. దీనివలన జుట్టు ధృడంగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు మటుమాయమవుతాయి.
Also Read: Asafoetida Health Benefits: చిటికెడు ఇంగువతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలలో!