Chukka Koora Health Benefits: చుక్క కూరను తినడం వల్ల కలిగే లాభాలు – మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో చుక్కకూర కూడా ఒకటి. మనకు వివిధ రకాల ఆకుకూరలు లభిస్తూ ఉంటాయి. ఆకుకూరలను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు…చుక్కకూర మనకు మార్కెట్ లో విరివిరిగా లభిస్తుంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు చుక్కకూరను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీంతో మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.
చుక్కకూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. చుక్క కూర రసంలో చిటికెడు వంటసోడాను కలుపుకుని తాగడం వల్ల శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గు ముఖం పాడతాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి.

Chukka Koora Health Benefits
చుక్క కూరలో అధికంగా ఉండే పీచు పదార్థాలు తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడంలో దోహదపడుతాయి. ఒక స్పూన్ చుక్క కూర రసాన్ని పెరుగులో కలుపుకుని మూడు రోజుల పాటు తీసుకోవడం వల్ల కామెర్ల వ్యాధి నివారణ చేయవచ్చు.
రేచీకటి సమస్యతో బాధపడే వారు చుక్కకూరను తినడం.జుట్టు రాలడం సమస్యతో బాధపడే వారు చుక్కకూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా చుక్కకూరను తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నయం చేయడంలో ఉపయోగపడుతుంది. దీనిలో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గడంలో కూడా చుక్కకూర మనకు సహాయపడుతుంది.