బ్రకోలీ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ మధ్యకాలంలో సూపర్ మార్కెట్స్ ల్లో దొరకటం వలన కొంతమందికి తెలిసింది. వారంలో రెండు సార్లు బ్రకోలీని ఆహారంలో భాగంగా చేసుకుంటే సరిపోతుంది. బ్రకోలీ విటమిన్ సి, జింక్, కాపర్, బి విటమిన్లు, ప్రోటీన్, ఆకుపచ్చని కూరల్లో వుండే సల్ఫోరాఫెన్ అనే ఫైటోకెమికల్ దీనిలో చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో నుండి మలినాలను బయటకు పంపుతుంది.
బ్రకోలీ వుండే ఇండోల్ – 3 కార్బినోల్, కాంఫ్ఫెరాల్ వంటి సమ్మేళనాలు మంట, వాపు నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన డయాబెటిస్ వున్నవారికి కూడా చాలా మంచిది. దీనిలో వుండే క్వెరెసిటిన్ వంటి యాంటీ ఆక్సీ డెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తూ, గుండె సంబంధ అనారోగ్యాలను దూరం చేస్తాయి. బ్రకోలీ సరిగ్గా శుభ్రం చేసిన తరువాతే వంటల్లో వాడాలని బాగా ఉడికించి మాత్రమే వంటల్లో వాడాలని నిపుణులు చెప్పుతున్నారు.
బ్రకోలీ తినడం వలన కలిగే లాభాలు..
Leave Your Comments