Boda kakarakaya Health Benefits: ప్రజంట్ కరోనా రూపాలు మార్చుకుంటూ మనషులపై అటాక్ చేస్తుంది. ఈ సమయంలో ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం. అన్ని వయసుల వారు మంచి పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి. శరీరానికి అవసరమైన అన్ని విటమిన్‌లను అందించే ఒక కూరగాయ గురించి మీకు చెప్పాలి. బొంత కాకర లేదా బోడ కాకర (Spiny Gourd) గురించి మీకు తెలిసే ఉంటుంది. దీనిని అడవి కాకర.. ఆగాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు.

Spiny Gourd
ఇందులో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి అన్ని పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను బలపరుస్తుంది. బోడకాకరను పోషకాల గని అనొచ్చు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D2, 3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ H, విటమిన్ K, కాపర్, జింక్ ఇలా అన్ని ఈ కూరగాయాలో ఉంటాయి. శరీరం ఫిట్‌గా ఉండటానికి కావాల్సినవి అన్నీ ఈ కూరగాయలో ఉన్నాయి.
Also Read: కూరగాయల్లో రారాజు ఆకాకర.!
ఆరోగ్య ప్రయోజనాలు:
- తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది.
- బోడకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.
- బోడకాకర తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపడుతుంది
- డయాబెటిక్ పేషంట్లకు సైతం బోడకాకర ఎంతో ఉపయుక్తం

Boda kakarakaya Health Benefits
- రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో బోడకాకర ఉపయోగపడుతుంది
- వర్షాకాలంలో వర్చే దురదల నుంచి కూడా కాపాడుతుంది
- పక్షవాతం, వాపు, అపస్మారక స్థితి, కంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది.
- రక్తపోటు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
- ఇందులోని ఫ్లవనాయిడ్లు వయస్సు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయి.
- గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది
- రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది
- కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెడుతుంది
- అధిక చెమటను తగ్గిస్తుంది
- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
- బోడకాకర దగ్గుకు మంచి మెడిసిన్
Also Read: కాకరకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..