Blackgram Health Benefits: మినప పప్పులో కూడా మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో మినపగుళ్లు కూడా ఒకటి.మినపగుళ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్యపెరగాడంతోపాటు వాటి నాణ్యత కూడా పెరుగుతుంది. మినపగుళ్లను పప్పుగా చేసి మనం ఉపయోగిస్తూ ఉంటాం.
జీర్ణశక్తి మెరుగుపడి మలబద్దకం సమస్య తగ్గుతుంది. సున్నుండలను తినడం వల్ల శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. ఈ సున్నండలను తినడం వల్ల మేహ, వాత రోగాలు తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మినపగుళ్లతో ఇడ్లీలను లేదా ఆవిరి కుడుములను చేసుకుని కారం, నెయ్యి లేదా కండచక్కెరతో కలిపి తినడం వల్ల పురుషుల్లో నపుంసకత్వం తగ్గుతుంది. కనుక వీటితో చేసే పదార్థాలలో నెయ్యిని కానీ, జీలకర్రను కానీ, కండ చక్కెరను కానీ వేసుకుని తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు.
Also Read: Management of Green Gram and Black Gram:పెసర, మినుము యాజమాన్య పద్ధతులు.!
వేడి చేసిన మినపగుళ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్రాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.మినపగుళ్లను, మెంతులను, ఉసిరికాయలను సమపాళ్లలో తీసుకుని నీటితో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి బాగా ఆరిన తరువాత తలస్నానం చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్యతోపాటు ఇతర జుట్టు సంబంధిత సమస్యలు కూడా తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. గంజిని ప్రతి రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండడం వల్ల ఆగిన బహిష్టు మరలా మొదలవుతుంది.
Also Read: Blackgram Cultivation: మాగాణి మినుములో కలుపు యాజమాన్యం అవసరమా.!