ఆరోగ్యం / జీవన విధానం

Bitter Gourd Health Benefits: ఇన్నీ లాభాలు ఉన్నాయి అని తెలిస్తే కాకరకాయను తప్పకుండా తింటారు.!

0
Bitter Gourd Benefits
Bitter Gourd Benefits

Bitter Gourd Health Benefits: మనలో చాలా మంది కాకరకాయ అనగానే ముఖం చిట్లించుకుంటారు. తినడానికి ఎక్కువగా ఇష్టపడరు.దీనికి కారణం చేదు గా ఉంటుంది అని మనలో చాలా మంది కాకరకాయను తినరు.అయితే ఈ చేదు వెనుక అనేక ఆరోగ్యవంతమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది శరీరానికి చేసే మేలు అంత ఇంత కాదు. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, ఫాస్పరస్ , పోటాషియం, సోడియం, జింక్, ఫైబర్ తో పాటు అనేక పోషక పదార్ధాలు ఉన్నాయి.

కాకరకాయ లో ఉండే ఫైబర్ మీ జీర్ణ శక్తి ని పెంపోదిస్తుంది. జీవ క్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్థాలను బయటకు పంపడంతో పాటు మాలబద్దకం సమస్యలను దూరం చేస్తుంది.కడుపులో ఏర్పడే పరన్నా జీవులను తొలగిస్తుంది.కాకరకాయ మీ కిడ్నీ లు మరియు మూత్రాశయాన్ని ఆరోగ్యం గా ఉంచుతుంది.

కాకరకాయ రాసాన్ని తీసుకోవడం వల్ల కిడ్నీలో ఏర్పడే రాళ్లని కూడా తొలగిస్తుంది. అంతే కాక లివర్ డ్యామేజి బారి నుండి కాపాడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎన్నో విధాలా మంచిది.శరీరంలో ఏర్పడే బ్యాడ్ క్లోలస్ట్రాల్ వలన రక్తాన్ని గుండెకు సరఫరా చేసే ధమనుల్లో ఏర్పడే అవరోధాలు నివారించి గుండెకు రక్త సరఫరా సఫిగా జరిగేలా చూస్తుంది. అందువల్ల గుండె ఆరోగ్యం తో ఉంటుంది. షుగర్ వ్యాధి తో బాధ పడేవారికి కాకరకాయ ఒక వరంగా చెప్పవచ్చు.

Also Read: Bitter Gourd Cultivation: కాకరకాయ సాగుకు అనుకూలమైన వాతావరణం

Bitter Gourd Health Benefits

Bitter Gourd Health Benefits

కాకరకాయలో ఇన్సులెన్ పోలి ఉండే రసాయనాలు రక్తంలోని షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల మధుమేహం తో బాధ పడేవారు కాకరకాయ ను తీసుకుంటే మంచిది. కాకరకాయ లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే వ్యర్థాలను బయటకు పంపి శరీరాన్ని అధిక బరువు సమస్య నుండి కాపాడుతుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థ ను మెరుగు పరుస్తుంది. అందువల్ల బరువు తగ్గాలి అనుకునే వారు తమ డైట్ లో కాకరకాయను తీసుకోవడం చాలా మంచిది.

కాకరకాయ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని ఫ్రీరాడికల్స్ బారి నుండి కాపాడుతుంది జలుబు మరియు దగ్గు లాంటి వ్యాధులను తగ్గిస్తుంది. అంతే కాకుండా యూరినరీ లో ఉండే వ్యాధులను తగ్గిస్తుంది.

ప్రతి రోజు తాజా కాకరకాయ జ్యూస్ ను తీసుకోవడం ద్వారా మొలల వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు.కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అంతే కాకుండా లివర్ సమస్యలను కూడా తగ్గిస్తుంది.ప్రతి రోజు కాకరకాయ జ్యూస్ తీసుకోవడం ద్వారా రక్త సంబంధిత దోషాలను తగ్గించవచ్చు.ఇందులో ఉండే యాంటి క్యాన్సర్ లక్షణాలు మిమల్ని క్యాన్సర్ బారి నుండి కాపాడతాయి.

Also Read: Bitter gourd cultivation: కాకరకాయ సాగులో మెళుకువలు

Leave Your Comments

Ridge Gourd Health Benefits: బీరకాయ వలన ఇన్నీ లాభాలు ఉన్నాయని తెలిస్తే దీనిని వదలకుండా తింటారు.!

Previous article

Sugar Vs Jaggery: పంచదారకు బదులు బెల్లం వాడడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా.!

Next article

You may also like