ఆరోగ్యం / జీవన విధానం

పప్పు దినుసుల ప్రయోజనాలు..

0

నోటికి రుచినే కాదు, పొట్టకు పోషకాలు అందించడంలోనూ పప్పులదే పైచేయి. రోజువారీ ఆహారంలో పప్పును తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
పప్పులో ప్రోటీన్లు, అధికంగా ఉంటాయి. ఓ కప్పు ఉడకబెట్టిన పప్పులో రోజుకు సరిపడా ఫైబర్ లభిస్తుంది.
పప్పులో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. మాంసాహారానికి దూరంగా ఉండేవారికి ప్రోటీన్లు పరిపూర్ణంగా అందవు అలాంటివారు.. ప్రొటీన్ల కోసం పప్పును తీసుకోవాలి. పప్పుల్లో ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి.
పప్పులో మధుమేహాన్ని తగ్గించే గుణాలున్నాయి. ప్రోటీన్ తో పాటు.. పీచుపదార్థాలు ఎక్కువగా లభించడంతో మధుమేహం అదుపులో ఉంటుంది.
వీటిలోని పోషకాలు మంచి బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. జీర్ణాశయ క్యాన్సర్, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలను
వీటిలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించే విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
పప్పును ఆహారంలో భాగం చేసుకుంటే పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. పేగుల్లోని కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచి.. క్యాన్సర్ ను నియంత్రించడంతో పాటు క్యాన్సర్ కణితులు పెరగకుండా చూస్తుంది.
పప్పులో మెగ్నీషియం, పొటాషియం వంటి గుండె ఖనిజ లవణాలుంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గిస్తాయి. పప్పులోని పీచు పదార్ధం రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ను, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
పప్పులో కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ – ఎ , జింక్ ఉంటాయి. కాబట్టి కంటిచూపు మెరుగతుంది. ముఖ్యంగా రేచీకటితో బాధపడేవారు .. పప్పును ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చు.

Leave Your Comments

శనగపంట కోత – నిల్వ చేయు విధానం

Previous article

తమలపాకు పంటలో సస్య రక్షణ – నివారణ చర్యలు

Next article

You may also like