ఆరోగ్యం / జీవన విధానం

ఇప్పపువ్వు ప్రయోజనాలు..

0

ఇప్పపువ్వు తెలంగాణలో దొరికే ప్రకృతి ప్రసాదం.దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఏజెన్సీ వాసులకు దీని పరిచయం అక్కర్లేదు దీంతో తయారుచేసిన సారా మత్తెక్కిస్తోంది. ఆదివాసీలకు ఇది మంచి ఆదాయ వనరు కూడా అయితే ఈ పువ్వుతో మత్తెక్కించే సారాయే కాకుండా చాలా వాటిలో ఉపయోగిస్తున్నారు. భారత దేశంలోని మెజార్టీ ఆడవాళ్ళలో రక్తహీనత ( రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం) కనపడుతుంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని ఏజెన్సీ గర్భీణుల్లో లక్షమందిలో 152 మంది, వెయ్యి మంది అప్పుడే పుట్టిన శిశువుల్లో 48 మంది చనిపోతున్నారు. ప్రసవ సమయంలో రక్తస్రావం జరిగి తల్లీబిడ్డలు మరణిస్తున్నారు. హెల్దీ ఫుడ్ తీసుకునే వాళ్లలోనే ఈ సమస్య ఉంటే.. ఇంకా ఏజెన్సీ ప్రాంత మహిళల్లో ఆ పరిస్థితి మరీ దారుణం. ఇంకా గర్భీణుల్లోనైతే హిమోగ్లోబిన్ 3 నుంచి 5 శాతం కూడా ఉండక ఎర్ర రక్త కణాలు తగ్గిపోతున్నాయి. దీంతో వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. ఇవన్నీ అరికట్టడానికి గిరిజన సంక్షేమ అధికారులు ఓ మార్గం ఎంచుకున్నారు. ఇప్ప పువ్వులో ఉండే ఐరన్ కు రక్త హీనత తగ్గించే లక్షణాలు ఉన్నాయి అలాగే ఇతర పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీంతో ఇప్ప పువ్వుతో చేసిన లడ్డూలను గర్భీణులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని ఏప్రిల్ నుంచి ఆరు నెలలు గర్భీణులకు అందించనున్నారు.

Leave Your Comments

హైడ్రోపోనిక్స్ విధానంలో సాగు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి..

Previous article

సేంద్రియ వ్యవసాయం చేస్తున్న డాలీకి.. ఉత్తమ రైతు మహిళా అవార్డు

Next article

You may also like