ఆరోగ్యం / జీవన విధానం

ఆ కాకరకాయలు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

0

ఆ కాకరకాయను తరచూ తీసుకోవడం వలన దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.
ఆ కాకరకాయలోని విటమిన్ సి శరీరంలోని ఇన్ ఫెక్షన్లతో పోరాడుతుంది. దీనిలో ప్లవనాయిడ్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్ కారకాలుగా పనిచేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో లభించే విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యం ఇస్తే అంత మంచిది.
మధుమేహంతో బాధపడేవారికి ఆకాకరకాయ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని ఇన్సులిన్ స్థాయిల్ని పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్దీకరిస్తుంది. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం, కండర కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపరిచేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. వంద గ్రాముల ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి.
ఆ కాకరకాయ గర్భిణులకు చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫోలేట్ లు శరీరంలోని కణాల వృద్ధికి, గర్భస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. గర్భిణులు రెండుపూటలా భోజనంలో ఈ కూరను తీసుకోవడం వలన దాదాపు వంద గ్రాముల ఫోలేట్ అందుతుంది.

Leave Your Comments

బ్లాక్ రైస్ గుణాలు.. ప్రాధాన్యత

Previous article

రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం.. పచ్చిరొట్ట పైర్లు

Next article

You may also like