గసగసాలను మనం ఎక్కువగా వంటలో వాడుతుంటాము. సుగంధ ద్రవ్యాలలాగే గసగసాలు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. గసగసాలను కూడా పూర్వ కాలంలో మందుల తయారీలో వాడేవాళ్లు. ఇక వీటి వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
గసగసాలను ఎక్కువగా కొనేందుకు ఇష్టపడరు. కానీ గసగసాలను తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలోని ఉండే ఆక్సలేట్లు, కాల్షియంను గ్రహించి రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి. గసగసాల్లో ఫైబర్ ఎక్కువ. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది. తద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నిద్రకు మేలు. కొంతమందికి సరిగా నిద్ర పట్టదు. అలాంటి వారు గసగసాలను తీసుకోవాలి.
ఇక రోజు పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పేస్ట్ ను కొద్దిగా కలిపి తాగితే చాలు చక్కటి నిద్ర వచ్చేస్తుంది. గసగసాలతో ఈ ప్రయోజనాలు ఉన్నాయి కదా అని వీటిని మరీ ఎక్కువగా వాడటం మాత్రం మంచిది కాదు. గసగసాలు ఎక్కువగా తింటే, మగవాళ్లలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందని అంటున్నారు.
శ్వాస సమస్యలకు చెక్. గసగసాలు ఎక్సెక్టోరెంట్, సిమల్సెంట్ (నయం చేసే గుణాలు ) గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవి శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. దగ్గు, ఆస్తమా వంటివి తగ్గుతాయి. గుండె సమస్య ఉన్నవారు గసగసాలు లైట్ గా ఫ్రై చేసి, షుగర్ కలిపి మార్నింగ్ , ఈవెనింగ్ హాఫ్ స్పూన్ తీసుకుంటే గుండె హాయిగా ఉంటుంది. గసగసాలు చలువ చేస్తాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడొచ్చు. కడుపులో మంట, ఎసిడిటి ఉన్న వారు గసగసాల్ని వాడితే పేగులలో అల్సర్లు, పుండ్లు వంటివి తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గసగసాలు తినడం వలన కలిగే ప్రయోజనాలు..
Leave Your Comments