ఉలవల్లో ఎన్నో పోషకాలున్నాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బోలెడు ప్రయోజనాల్ని ఇస్తాయి.
ఉలవల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ లతో పాటు బోలెడంత పీచు పదార్థం లభిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు వీటిని రోజూ చారుగా కానీ, స్నాక్స్ గా కానీ తీసుకోవచ్చు. ఉలవలు, కొత్త బియ్యం సమానంగా తీసుకుని జావ చేసుకుని తాగితే కాల్షియం లభిస్తుంది. ఎముకలకు, కండరాలకు కూడా శక్తి అందుతుంది. గాయాలు త్వరగా మానడానికి ఉలవలు తోడ్పడతాయి.
ఉలవల్లోని పీచు పదార్థం మలబద్దకాన్ని నివారిస్తుంది. దీంతో జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. ఆకలి పెరుగుతుంది. వీటిని ఎదిగే పిల్లలు తింటే చాలా మంచిది. ఉలవలతో రుతుక్రమ సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు.
ఉలవలు తినడం వలన కలిగే ప్రయోజనాలు..
Leave Your Comments