ఆరోగ్యం / జీవన విధానం

కలోంజీ పాలు తాగడం వలన కలిగే ప్రయోజనాలు..

0

సుగంధ ద్రవ్యాలలో చక్కటి ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆయుర్వేద మందుల తయారీకి కూడా ఉపయోగపడుతాయి. కలోంజీని ఇళ్లలో ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. అయితే కలోంజీకి పాలు కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
బ్రెయిన్ షార్ప్: కలోంజీ పాలు మానసిక ఎదుగుదలకు దోహదపడుతాయి. మెదడు పనితీరుకి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్, న్యూరాన్ – ప్రొటెక్టింగ్, యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కలోంజీ పాలు మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా మెలటోనిన్ నరాలను రిలాక్స్ చేస్తాయి. ఈ పాలను నిద్రపోయే ముందు తాగితే చాలా మంచిది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది: కలోంజీ పాలు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. పెరుగుతున్న బరువును తగ్గిస్తుంది. ఆహారంలో 1 నుంచి 3 గ్రాముల కలోంజీని చేర్చడం వల్ల జీర్ణక్రియ సులువుగా జరుగుతుంది. ఉదర సమస్యలకు దరిచేరకుండా చేస్తాయి.
మధుమేహానికి ప్రయోజనకరం: కలోంజీ విత్తనాలు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కలోంజీ పాలు తాగడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది మధుమేహానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
హృదయానికి మంచిది: కలోంజీ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కలోంజీ పాలు తాగడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయి తగ్గుతుంది వాపులు కూడా తగ్గుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి దోహదపడుతుంది.
నొప్పిని తగ్గిస్తుంది: కలోంజీ పాలు శరీరం, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం గోరువెచ్చని పాలతో కలిపి తాగితే శరీర నొప్పులు తగ్గుతాయి. ఇది కాకుండా మంటను, గ్యాస్ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. కలోంజీ పాలను డైట్ ను చేర్చే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.
కలోంజీ పానీయం తయారు విధానం:
ఒక గ్లాసు పాలలో ఒక చెంచా కలోంజీ పొడిని కలపాలి. రుచిని పెంచడానికి ఒక చెంచా తేనే, చిటికెడు జాజికాయ పొడిని కలపాలి. మీకు షుగర్ లేదా బరువు సమస్య ఉంటే చక్కెర, తేనే ఉపయోగించకూడదు.

Leave Your Comments

ప్రపంచ శాఖాహార దినోత్సవం – శాఖాహారం తినడం వలన కలిగే ప్రయోజనాలు

Previous article

అరేబియా సముద్రంలో బలపడుతున్న షహీన్ తుఫాన్..

Next article

You may also like