బ్లాక్ టీ, గ్రీన్ టీ, రెడ్ టీ ఇలా ఎన్నో వెరైటీ టీలు మార్కెట్లో ఉన్నాయి. గ్రీన్ టీ దశాబ్ద కాలంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ మనలో చాలామంది బ్లూ టీ గురించి తెలియదు. మిగతా వాటన్నింటి కంటే బ్లూ టీ చాలా బెటర్ అంటున్నారు దాన్ని తాగిన వారు. బ్లూ టీని అపరాజిత పుష్పాలతో తయారు చేస్తారు. ఈ టీ రంగుని చాలా మంది తాగేందుకు ఇష్టపడరు. కానీ వీటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు. ఈ టీతో అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బ్లూ టీలో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వయసు ఎక్కువగా ఉన్నా కనిపించదు. దీన్ని డైలీ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
కాలేయంలో పిత్తరస ఉత్పత్తికి బ్లూ టీ దోహద పడుతుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బ్లూ టీ తాగడం వలన వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు. బ్లూ టీలో ఉంటే యాంటీ గ్లైసాటీన్ ప్రాపర్టీస్ వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి చర్మ వ్యాధులు దరిచేరవు. చర్మంపై ముడతలు పడకుండా కాపాడుతుంది. అంతేకాదు మంచి నిగారింపు వస్తుంది.
బ్లూ టీలో ఆంథోసైనిన్ ఉంటుంది. ఈ కారణంగా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. తలకు రక్తప్రసరణ పెంచి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. డయాబెటిస్ పేషేంట్లు రెగ్యులర్ టీ కాకుండా బ్లూ టీ తాగితే చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఈ టీ తాగితే రోజంతా ఉల్లాసంగా ఉంటారు.
బ్లూ టీని క్రమం తప్పకుండా తాగడం వలన క్యాన్సర్ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుంది. క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
బ్లూ టీ మన మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇలా ఎన్నో అద్భుత ప్రయోజనాలుండే ఈ టీని మీరు ఓసారి ట్రై చేయండి.
బ్లూ టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు..
Leave Your Comments