వేసవికాలం కావడంతో ప్రతి సంవత్సరం లా ఈ సంవత్సరం కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయట ఎండలు మండిపోతున్న సమయంలో శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతూ కొంతమంది ని తెగ టెన్షన్ పెడుతోంది. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తూ ఉండటం గమనార్హం. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి కొందరు సహజసిద్ధమైన పద్ధతులను అనుసరిస్తే మరి కొందరు శీతల పానీయాలను తాగుతూ ఉంటారు. అయితే ఇతర పానీయాలతో పోలిస్తే బార్లీ నీటి పానీయం తాగడం వల్ల వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది. నిత్యం బార్లీ నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. బార్లీ నీటిని తాగడం వాళ్ళ అనేక ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ఒక పాత్రలో రెండు లీటర్ల తాగునీటిని తీసుకుని అందులో బార్లీ గింజలను వేయాలి. 20 నిమిషాల పాటు ఆ నీటిని మరిగిస్తే బార్లీ గింజలు మెత్తగా మారడంతో పాటు అందులోని పోషకాలు నీటిలో చేరతాయి. ఆ నీటిని చల్లార్చి వడబోసిన తరువాత పరగడుపున లేదా మధ్యాహ్నం ఎండకు బయటకు వెళ్లివచ్చిన తర్వాత తాగితే మంచిది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. మూత్రాశయం శుభ్రంగా మారడంతో పాటు కిడ్నీలోని రాళ్లు కరిగిపోయే అవకాశం ఉంటుంది. జీర్ణాశయ ఇబ్బందులు, ఉదర సమస్యలు తొలగిపోవడంతో పాటు కీళ్లు, మోకాళ్ళు నొప్పులు తగ్గుతాయి.
బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి శరీరం చల్లగా మారే అవకాశం ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ నీటి వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరగడంతో పాటు రక్త సరఫరా మెరుగుపడే అవకాశం అయితే ఉంటుంది. ఎండలో తిరిగి వచ్చిన వారు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలన్నా, వడదెబ్బ తాకకుండా ఉండాలన్నా ఈ నీటిని తాగితే మంచిది.
బార్లీ నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాలు..
Leave Your Comments