ఆరోగ్యం / జీవన విధానం

కరివేపాకు టీ ప్రయోజనాలు..

0

టీ, కాఫీలు ఎక్కువగా తాగడం ఒంటికి మంచిది కాదు. వాటికి ప్రత్యామ్నాయంగా కరివేపాకు టీ తాగడం మంచిది. అటు అలవాటు మానుకో అక్కర్లేదు. ఇటు ఆరోగ్యం
కూడా.. కరివేపాకు సువాసన నరాలను రిలాక్స్ చేస్తుంది. కాబట్టి రోజుకోసారి కరివేపాకు టీ తాగితే అలసట తగ్గిపోతుంది. ఒత్తిడినుంచి ఉపశమనం పొందుతారు. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫెనోలిక్స్ చర్మ వ్యాధులను నయం చేస్తాయి. మధుమేహం ఉన్నవారు షుగర్ ఫ్రీ టీ తాగాలనుకుంటారు. అలాంటివారికి ఈ టీ మంచి ప్రత్యామ్నాయం. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
ఆహారం జీర్ణమవక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ టీ తాగి చూడండి. ఉపశమనం లభిస్తుంది. అంతేనా ఈ టీ అరుగుదలకి మంచి ఔషధం కూడా.
తయారీ విధానం:
ఓ గిన్నెలో నీరు పోసి బాగా మరిగించండి. తరువాత కడిగిన కరివేపాకు రెబ్బల్ని అందులో వేయండి. రంగు మారిన తర్వాత ఈ నీటిని ఫిల్టర్ చేయండి. దానికి కాస్త తేనె చేరిస్తే చాలు.

Leave Your Comments

మునగ మొక్కల పెంపకంతో లాభాలు ఆర్జిస్తున్న రైతులు

Previous article

పశుగ్రాస పంటల సాగులో పాటించవలసిన జాగ్రత్తలు..

Next article

You may also like