Banana Health Benefits: ఒత్తిడికి గురైనా.. కాస్త అలసటగా అనిపించినా..వ్యాయామం చేసిన తర్వాత వెంటనే అరటిపండు తింటే మంచి రిలీఫ్ ఉంటుంది. ఉపవాస సమయంలో చాలామంది దీన్నే ఆహారంగా తీసుకుంటారు.
అరటిపండు తిన్న వెంటనే ఎనర్జీ ఇస్తుంది. ఒత్తిడికి గురైనా.. కాస్త అలసటగా అనిపించినా..వ్యాయామం చేసిన తర్వాత వెంటనే అరటిపండు తింటే మంచి రిలీఫ్ ఉంటుంది. ఉపవాస సమయంలో చాలామంది దీన్నే ఆహారంగా తీసుకుంటారు. అరటిపండులో కొవ్వులు, పొటాషియం(potassium), ఫాస్ఫరస్, పిండిపదార్థాలు, పీచు,పెప్టిన్, సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, విటమిన్-సి(vitamin C), విటమిన్-బి6 ఉంటాయి. అరటిపండు ప్రయోజనాలు ఏంటి.. ఎవరికి అరటిపండు అనర్థం వంటి విషయాలు తెలుసుకుందాం పదండి.
ప్రయోజనాలు
- పెరుగన్నంలో అరటిపండు కలిపి తింటే తలనొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది
- రెండు మూడు మిరియాలు వేసుకుని అరటిపండు తింటే కఫం, దగ్గు తగ్గుతాయి.
- అరటిపండులో ఉండే పెప్టిన్ పేగులకు మేలు చేస్తుంది. విరేచనం సాఫీగా జరిగేలా చూస్తుంది.
- ముదర పండిన అరటిపండు తింటే మలబద్ధకం ఉండదు. పచ్చి అరటిపండు తింటే విరేచనాలు తగ్గుతాయి.
Also Read: ఎర్ర అరటి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
- అరటిపండులో ఉండే విటమిన్-బి6 హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.
- ఒళ్లునొప్పులు, వాపులు ఉన్నవాళ్లు తింటే అవి తగ్గుతాయి. పెద్దపేగు పుండుతో బాధపడేవాళ్లు కూడా అరటిపండును తీసుకోవచ్చు.
- అరటిపండులోఉండే ఫాస్ఫరస్ ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది.
- నెలసరికి ముందు ఆందోళన, ఒత్తిడి, అలసటతో బాధపడేవాళ్లు అరటిపండు తింటే రిలీఫ్ ఉంటుంది
- ఎక్కువగా వ్యాయామం చేసేవాళ్లు కండరాలు కృశించిపోకుండా ఉండటానికి బనానా తీసుకుంటారు. దీనిలో ఉండే పొటాషియం వెంటనే శక్తిని పుంజుకునేలా చేస్తుంది.
- అరటిపండు తొక్కలో ఉండే తెల్లటి పొరలో కూడా ఔషధ గుణాలుంటాయి.
Also Read: నీలి అరటిపండ్లు ఎప్పుడైనా తిన్నారా..