Banana Leaf Health Benefits: ఆహారం రుచి చూడటం మానవ జన్మకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. పొడవాటి ఆకుపచ్చని పసుపు రంగులో ఉండే అరటి ఆకుపై మంచి గుమగుమలాడే రుచికరమైన భోజనం తినడం వలన వచ్చే సంతృప్తి అంతా ఇంత ఉండదండోయ్! కొన్ని సందర్భాలలో ఆహార ప్రియులకు ఈ సంతృప్తిని మించినది భూమి పైన ఏమీ లేదు అంటే నమ్మండి. అవును! మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఇది కేవలం కంటికి ఆకట్టుకునే విధంగా ఉండటమే కాకుండా అరటి ఆకులో తినడం వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండోయ్. అవేంటో మీరు కూడా తెలుసుకోండి.

Banana Leaf
అరటి ఆకులో తినడం ప్రాచీన దక్షిణ భారతదేశంలో సంప్రదాయంగా మొదలైన ఆచారం, ఇది ఇప్పుడు ఆరోగ్యానికి మేలు చేకూర్చేదిగా అనేక పరిశోధనలు రుజువు చేశాయి. అరటి ఆకులో భోజనం చేయడం రుచి, పర్యావరణ హితమైందే కాకుండా , రసాయన రహితమైనది కూడా. ప్లాస్టిక్ ప్లేట్లు పర్యావరణానికి , మానవాళికి ఎంతో కీడు చేస్తాయి కానీ అరటి ఆకుల్లో తినడం అనే పద్ధతి, అన్ని విధాలా ఆరోగ్యకరం. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలి ఫెనోల్స్ అరటి ఆకులో కూడా ఉంటాయి. ఈ పాలీ ఫెనాల్స్ శరీరంలోని పార్కిన్సన్ వంటి వ్యాధులను అదుపు లోపెట్టడనికి ఉపయోగపడును.
Also Read: Banana Peel Tea: అరటి తొక్క టీ ప్రయోజనాలు
అరటి ఆకులలో పార్కిన్సన్స్ వ్యాధికి నివారించుటకు ఉపయోగపడే పాలీఫెనాల్ ఆక్సిడేస్ ఎంజైమ్ ఉంటుంది. అరటి ఆకు ఆంటీ బాక్టీరియల్. సూక్ష్మ జీవుల నుండి సంక్రమించే వ్యాధుల నివారణ, సరైన జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. మైనపు పూత ఉండే అరటి ఆకులు నిగనిగలాడుతు దానిపై వడ్డించే వేడి ఆహారానికి సూక్ష్మమైన రుచిని అందిస్తుంది. సంప్రదాయ అరటి ఆకులో పప్పు నెయ్యి వంటి ఆహారానికి వచ్చే రుచి అమోఘం. అదొక్కటే కాదండోయ్.! అరటి ఆకుల్లో తినడం వల్ల ప్లేట్ లు కడిగే శ్రమ ఉండదు కదా! ఆడవారికి సంతోషకరమైన వార్త.

Banana Leaf Benefits
ఇవి పర్యావరణ తక్కువ సమయంలో సులభంగా కుళ్ళిపోతాయి. అదే ప్లాస్టిక్ అయితే మాత్రం పూర్తిగా కుల్లిపోవడానికి కనీసం ఒక శతాబ్దం పడుతుంది. ఇందులో తినడం వలన పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేసినవారు అవుతారు. అరటి ఆకు పెద్ద పరిమాణంలో ఉంటే అదనపు ప్రయోజనమండొయ్, మొత్తం భోజనం ఒకేసారి వడ్డించుకోవచ్చు. ఇది వాటర్‌ప్రూఫ్‌గా ఉండటం కారణంగా ఎక్కువ తడిగా మారదు కాబట్టి గ్రేవీలను పట్టుకోగలదు.
అరటి ఆకులను కేవలం ప్లేట్‌గా మాత్రమే కాకుండా వంట కోసం కూడా వాడవచ్చు. వస్తువులను చుట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. అరటి ఆకులో ఆహార పదార్ధాలలో ఉపయోగించే EGCG మూలాలు కూడా ఉన్నాయి. ఇది తీపి రుచిని ఆహారానికి అందిస్తుంది.ఇలా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండీ.!! మీరు కూడా అరటి ఆకులో తిని ఇంత మేలు పొందవచ్చు. ఈ సారి వీలుంటే తప్పకుండా ట్రై చేయండి….
Also Read: Banana Paper Uses: అరటి కాగితం ఉత్పత్తి