ఆరోగ్యం / జీవన విధానం

Tulasi Health Benefits: ఆరోగ్య వరదాయని తులసి.!

2
Tulasi Benefits
Tulasi Benefits

Tulasi Health Benefits: తులసి భారతదేశంలో సర్వసాథారణమైన మొక్కగా పరిగణంచబడుతుంది. దీనిని ‘‘మూలికల రాణి’’ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో ఆత్యంత సాధారణ గృహమొక్క మరియు ఇది హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది. అనేక హిందూ ఇతిహాసాలు తులసి యొక్క ప్రాముఖ్యత, లక్షణాలు మరియు ఉపయోగాలను వివరిస్తాయి. తులసి మొక్క మానవాళికి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది అందించే అనేక రకాల ఔషధ ప్రయోజనాల కారణంగా, తులసి ఆకులను ఆయుర్వేద ఔషదాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఇది జీవితం యొక్క దీర్ఖాయువును ప్రోత్సాహిస్తుంది.

జలుబు, మంట, మలేరియా, గుండె జబ్బులు, తలనొప్పి, కడుపులోనొప్పి, లోపాలు, మూత్రపిండాల్లో రాళ్ళు, మరియు మరెన్నో వివిధ వ్యాధులను నయం చేయడానికి విస్తృతంగా ఉపయోగించబడతాయి. తులసి ఆకులలో విటమిన్‌ ` ఎ, సి మరియు కె, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, ఐరన్‌ మరియు పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మంచి మొత్తంలో ప్రొటీన్‌ మరియు ఫైబర్‌ కూడా ఉన్నాయి.

తులసి యొక్క మూడు ప్రధాన రకాలు భారతదేశంలో పెరుగుతాయి :
1. రామ తులసి (ప్రకాశశంతమైన ఆకుపచ్చ ఆకులు కలిగి ఉంటుంది).
2. కృష్ణతులసి (ఊదా ఆకుపచ్చ ఆకులతో ఉంటుంది)
3. వన తులసి (సాధారణ ఆడవిలో ఉంటుంది.)

తులసి మొక్క ప్రయోజనాలు :

1. సహజ రోగనిరోధక శక్తిగా పనిచేస్తుంది.
తులసిలో విటమిన్‌ సి మరియు జింక్‌ పుష్కలంగా ఉన్నాయి. ఇది సహజమైన రోగనిరోథక శక్తిగా పనిచేస్తుంది. ఇందులో అపారమైన యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ మరియు యాంటీ ఫంగల్‌ గుణాలు ఉన్నాయి. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తాయి. తులసి ఆకుల సారం, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

2. జలుబు, దగ్గు మరియు ఇతర శ్వాసకోశ రుగ్మతలను తగ్గిస్తుంది :
తులసిలో ఉంటే కెఫేన్‌, సినిమోల్‌ మరియు యూజినాల్‌ జలుబును తగ్గించడంలో, సహాయబడుతుంది. తులసి ఆకుల రసాన్ని తేనె మరియు అల్లంతో కలిపి తీసుకుంటే బ్రొన్కైటిస్‌, ఆస్తమా, ఇన్‌ఫ్లూ, దగ్గు మరియు జలుబు వంటి వాటిలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

3. జ్వరాన్ని తగ్గిస్తుంది మరియు నొప్పులను నివారిస్తుంది :
తులసిలో యాంటీ ` బ్యార్టీయల్‌ మరియు యాంటీ వైరల్‌ గుణాలు ఉన్నాయి.  ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. తద్వారా జ్వరాన్ని తగ్గిస్తుంది. తులసిలో ఉండే యూజినాల్‌ నొప్పిని తగ్గించే గుణాలు శరీరంలో నొప్పులను తగ్గిస్తుంది.

4. గుండె, ఆరోగ్యానికి మంచిది :
తులసి రక్తంలో లిపిడ్‌ కంటెంట్‌ను తగ్గించడం, ఇస్కేమియా మరియు ప్ప్రోక్‌ను అణిచివేయడం, రక్తపోటును తగ్గించడం, మరియు అధిక యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు కారణంగా గుండె సంబంధిత వ్యాధుల చికిత్స మరియు నివారణపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.

Also Read: Tulasi Cultivation: తులసి సాగులో మెళుకువలు.!

Tulasi Health Benefits

Tulasi Health Benefits

5. ఒత్తిడి మరియు రక్తపోటును తగ్గిస్తుంది :
తులసిలో ఒసిమెమోసైడ్స్‌ ` ఎ మరియు బి సమ్మేళనాలు ఉన్నాయి. ఈ సమ్మేళనాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. మెదడులోని న్యూరోట్రాన్మిటర్లు సెర్కోటొనిస్‌ మరియు డొపమైన్‌లను సమతుల్యం చేస్తాయి. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపు మరియు రక్తపోటును తగ్గిస్తాయి.

6. క్యాన్సర్‌ నిరోధక లక్షణాలు :
తులసిలో ఉండే ఫైటోకెమికల్స్‌ బలమైన యాంటీ ` ఆక్సిడెంట్‌ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువలన ఇవి చర్మం, కాలేయం, నోటి మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ల నుండి మనలను రక్షించడంలో సహాయపడుతుంది.

7. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :
తులసి టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇది గ్యాస్ట్రిక్‌ రసాల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది యాంటీస్సాస్మోడిక్‌ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను సక్రమంగా చేసే శక్తిని అందిస్తుంది.

8. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది :
తులసి ఆకులలో హైపోగ్లైసిమిక్‌ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి మరియు మధుమేహం యొక్క సమస్యలను నివారిస్తాయి. ప్యాంక్రియాస్‌ను ఉత్తేజపరిచేందుకు మరియు ఇన్సులిన్‌ నిరోధకతను తగ్గించడానికి టీలో కొన్ని క్రియాశీల భాగాలు ఉన్నాయి.

9. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :
తులసిలోని యాంటీ ` మైక్రబియల్‌ లక్షణాలు నీటిలోని హానికరమైన జెర్మ్స్‌ మరియు బ్యాక్టీరియాతో పోరాడడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. అదనంగా పుదీనా ఆకుల సారం నోటిని తాజాగా చేస్తుంది.  మరియు నోటి దుర్వాసనను తొలగిస్తుంది.

10. ఆర్థరైటీిస్‌ నుండి ఉపశమనానికి ఉపకరిస్తుంది :
తులసిలో యాంటీ, ఇన్ఫమేటరీ గుణాలను పుష్కలంగా కలిగి ఉన్నాయి. దీర్ఘకాలికి నొప్పి లేదా గౌట్‌ మరియు ఆర్థరైటీస్‌ వంటి కీళ్ల రుగ్మతల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.

11. ఒత్తిడిని తగ్గిచడంలో సహాయపడుతుంది :
తులసి ఆకులతో టీని తయారు చేయడం వల్ల ఒత్తిడి లేదా ఆందోళన నుండి ఉపశమనం పొందవచ్చు. శారీరక, భావొద్వేగ లేదా పర్యావరణ కారకాల కారణంగా ప్రేరేపించబడిన మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటుగా ఒత్తిడి నిరోధక లక్షణాలను తులసి మొక్క కలిగి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శరీరంలో కార్టిసాల్‌ స్థాయిలను సమతుల్యం చేయడానికి కూడా సహాయపడుతుంది.

డా. బి. అనిలా కుమారి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
జె. కీర్తి (పమ్‌.పస్సి,స్కాలర్‌) మరియు
ఇ. జ్యోత్స్న, అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌
పొస్ట్‌ గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ సెంటర్‌
ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం,
రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.

Also Read: Tulsi Tea Health Benefits: తులసి టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే, రోజు తాగుతారు.!

Leave Your Comments

Minister Niranjan Reddy: రైతులకు ప్రతి రోజూ కేసీఆర్ జన్మదినమే – మంత్రి నిరంజన్ రెడ్డి

Previous article

Rabi Cultivation: రబీ సాగు విస్థరణ పై ఈశాన్య ఋతు పవన ప్రభావం.!

Next article

You may also like