Sorrel Fruit Benefits: సాధారణంగా గోంగూర ఆకు గురించి మనందరికీ తెలిసే ఉంటుంది, కానీ గోంగూర చెట్టు యొక్క కాయల వల్ల కలిగే లాభాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ గోంగూర ఆకులతో పాటు కాయల్లో కూడా మన ఆరోగ్యానికి కావాల్సిన చాలా పోషకాలు లభిస్తాయి. ఇవి ఎరుపు రంగులో, పుల్లని రుచిని కలిగి ఉంటాయి. గోంగూర కాయలను జ్యూస్ గా కూడా సేవిస్తారు. ఈ కాయలలో కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు, వీటిలో ఫైబర్, మెగ్నీషియం మరియు విటమిన్లు సి, ఎ వంటి సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. ఈ గోంగూర కాయల్లో కేలరీలు, ప్రోటీన్, పిండి పదార్థాలు, ఫైబర్, విటమిన్ సి, మెగ్నీషియం, విటమిన్ A, మాంగనీస్, రాగి, ఇనుము, పొటాషియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6, భాస్వరం వంటి అనేక పోషకాలు లభిస్తాయి.
కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ కాయల్లో ఉండే ఆమ్లాలు బరువును తగ్గించడంలో సహాయపడతాయని తేలింది. ఇందులో ఉండే విటమిన్ A బలహీనమైన కంటి చూపును మెరుగుపరచడానికి మరియు వయస్సు-సంబంధిత కంటి క్షీణతను నివారించడానికి తోడ్పడుతుంది. ఈ గోంగూర కాయల్లో ఉండే ఆంథోసైనిన్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడతాయి, ఇవి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎగ్జిమా, మరియు క్యాన్సర్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. ఈ కాయలలో ఉండే యాంటీహైపెర్టెన్సివ్ గుణాలు రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి, అలాగే ఇతర గుండె సంభందిత సమస్యలు రాకుండా కూడా నివారిస్తాయి.
Also Read: Palm Toddy Benefits: ఎన్నో రకాల వ్యాధులను తరిమికొట్టే.. తాటి కల్లు ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
గోంగూర కాయలను పూర్వం నుండి జలుబు మరియు ఫ్లూ సమస్యలను నివారించడం కోసం అద్భుతమైన నివారిణిగా ఉపయోగిస్తున్నారు. వీటిలోని అధిక విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఈ కాయలకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది కాబట్టి ఇవి జ్వరాన్ని నయం చేయడంలో కూడా తోడ్పడతాయి. మహిళల్లో ఋతుస్రావం ప్రారంభమయ్యే కొన్ని రోజుల ముందు వీటితో తయారుచేసిన టీని తాగడం వల్ల రుతుక్రమంలో కలిగే నొప్పిని నివారించవచ్చు. గోంగూర ఆకు నుండి తీసిన సారం కూడా రుతుక్రమ సమస్యలకు సహాయపడుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. వీటితో పాటు ఇవి మలబద్దకాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.