Red Rice Benefits: ప్రతిరోజు మనం తినే ఆహారంలో అన్నం తప్పనిసరిగా తీసుకుంటాం. అయితే ఈ బియ్యం చాలా రకాలుగా ఉంటాయి. ప్రపంచంలో దాదాపుగా 40,000 పైగా బియ్యం వెరైటీలు ఉన్నాయి, అందులో ఒకటే ఈ ఎర్ర బియ్యం (Red Rice). తరచుగా బియ్యం తీసుకోవడం బరువు పెరగడానికి ముడి పడి ఉంటుంది, కానీ అన్ని రకాల బియ్యం అలా ఉండవు. ఎర్ర బియ్యంలో ప్రధాన పోషకం ఆంథోసైనిన్, ఇది ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అద్భుతమైన సమ్మేళనం. ఈ బియ్యం ఎరుపు రంగు ఉండానికి కారం ఆంథోసైనిన్ సమ్మేళనమే, ఇది రక్తపోటును తగ్గించడం, మధుమేహాన్ని నివారించడం, దృష్టిని మెరుగుపరచడం మరియు క్యాన్సర్ కణాలను తగ్గించడం వంటి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అదనంగా, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఎర్ర బియ్యంలో ఫైబర్, విటమిన్ B1 మరియు B2, కాల్షియం మరియు ఐరన్ కంటెంట్ కూడా లభిస్తాయి.
ఎర్ర బియ్యంలో కేలరీలు, ఫైబర్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఐరన్, జింక్, పొటాషియం మరియు సోడియం వంటి ఖనిజాలు లభిస్తాయి. ఎర్ర బియ్యం రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇది మధ్యాహ్న ఆకలిని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. కరోనా మహమ్మారి, ఊపిరితిత్తుల ఆరోగ్యం ఎంత ప్రముఖమైనదో మనకు తెలిసేలా చేసింది.
ఇందులో లభించే మెగ్నీషియం కంటెంట్ కారణంగా, రోజువారీ ఆహారంలో ఎర్ర బియ్యాన్ని చేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. బలం విషయంలో రాజీ పడకుండా బరువు తగ్గాలని మీరు ఎదురు చూస్తున్నట్లయితే, రెడ్ రైస్ మీకు ఒక అద్భుతమైన ఎంపిక. ఎర్ర బియ్యంలో కాల్షియం మరియు మెగ్నీషియం గణనీయమైన మొత్తంలో ఉండటం వల్ల కీళ్లనొప్పులు, బోలు ఎముకల వ్యాధి మరియు వివిధ ఎముక సంబంధిత రుగ్మతలను నివారించడంలో సహాయపడుతుంది.
Also Read: Okra Cultivation: బెండలో ఎరువులు మరియు నీటి యాజమాన్యం.!
జీర్ణక్రియను నియంత్రించడంలో, పోషకాలను సరైన రీతిలో గ్రహించడంలో, ప్రేగుల కదలికను సులభతరం చేయడంలో ఎర్ర బియ్యంలో ఉండే డైజెస్టివ్ ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎర్ర బియ్యాన్ని సరిగ్గా ఉడికించి తిన్నప్పుడు మలబద్ధకం మరియు విరేచనాలు రెండింటికీ చికిత్స చేయడంలో తోడ్పడుతుంది. రెడ్ రైస్ యొక్క ప్రత్యేక లక్షణాలలో ఒకటి ఆంథోసైనిన్, ఇది అకాల వృద్ధాప్య సంకేతాలు రాకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే జింక్, ఐరన్ మరియు ఇతర మినరల్స్ వంటి విటమిన్లు మీ చర్మానికి మంచి గ్లో ఇచ్చి మెరిసేలా చేస్తాయి. ఆస్తమాను నివారించడంలో కూడా ఈ రెడ్ రైస్ కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: Pests of Papaya: బొప్పాయిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం.!