Papaya Health Benefits: బొప్పాయి పండు మనలో చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దీనిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇతర పండ్ల లాగా బొప్పాయి పండు కూడా అనేక పోషకాలను కలిగి ఉంటుంది. బొప్పాయి పండును రోజూ తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంటుంది. బొప్పాయి పండును ఎక్కువగా తింటూ ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, పలు రకాల క్యాన్సర్ లు రాకుండా ఉంటాయి. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.ఎముకలు దృఢంగా ఉంటాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది.
బొప్పాయి పండును తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీనిని తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. బరువు తగ్గడంలో కూడా బొప్పాయి పండు సహాయపడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు పండిన బొప్పాయిని తినడం వలన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మానసిక ఆందోళనకు గురి అయినప్పుడు బొప్పాయి పండను తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది.
Also Read: Papaya Mask for Facial Beauty: ముఖ సౌందర్యం కోసం బొప్పాయి మాస్క్!
బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి జార్‌లో వేయాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసి మిక్సీ పట్టి రసాన్ని తీసి దానికి తేనెను కలిపి తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. బొప్పాయి పండు తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. బొప్పాయి పండును, గ్రీన్ టీ ని కలిపి తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణంలో ఉంటుంది. అలాగే గుండె జబ్బులతో బాధపడే వారు దీనిని తినకపోవడమే మంచిది. అంతే కాకుండా ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లలకు కూడా దీనిని ఇవ్వకూడదు. అంతే కాకుండా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఎట్టి పరిస్థితులలోనూ దీనిని తినరాదు.
బొప్పాయి పండు కొందరిలో అలర్జీని కలిగిస్తుంది. బొప్పాయి పండును తినడం వల్ల దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన జీర్ణ వ్యవస్థలోని క్రిములను నాశనం చేస్తాయి. దీంతో రోగాల బారిన పడకుండా ఉంటాం. అలాగే తెగిన, కాలిన గాయాలపై బొప్పాయి పండు గుజ్జును ఉంచడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. అంతే కాకుండా అధికంగా తినడం వల్ల వేడి చేస్తుంది.
Also Read: Papaya cultivation: బొప్పాయి సాగులో మెళుకువలు