ఆరోగ్యం / జీవన విధానం

Aliv seeds benefits: అలీవ్ గింజలతో ప్రయోజనాలు బోలెడు

0

Aliv అలివ్ గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మరియు మలబద్ధకం, ఉబ్బరం మరియు అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యలకు చికిత్స చేస్తుంది.

తల్లయ్యాక ప్రతి మహిళలోనూ శారీరక మార్పులు సహజమే. ఈ క్రమంలోనే తమ అందం, అధిక బరువు గురించి ఆందోళన చెందుతూ ఒత్తిడి-ఆందోళనలకు గురవుతుంటారు చాలామంది అతివలు. అయితే వీటన్నిటికీ అలీవ్‌ గింజలతో చెక్ పెట్టచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.

  • అందం తగ్గిపోవడం, బరువు పెరగడం, జుట్టు ఎక్కువగా రాలిపోవడం.. వంటి సమస్యలు కొత్తగా తల్లైన మహిళల్లో కామన్‌! మరి, వీటన్నింటి నుంచి బయటపడాలంటే అలీవ్‌ గింజలు చక్కగా దోహద పడతాయి. అలాగే ప్రసవానంతరం తిరిగి కోలుకోవడానికి తీసుకునే పదార్థాల్లో అలీవ్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

  • అంతేకాదు.. కొత్తగా తల్లైన మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచడంలోనూ ఈ గింజలు ముందుంటాయి.
  • ఐరన్‌, ఫోలికామ్లం, విటమిన్‌ ‘ఎ’, విటమిన్‌ ‘ఇ’, అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు.. వంటి పోషకాలు పుష్కలంగా నిండి ఉన్న ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ దోహదం చేస్తాయి.
  • సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాల్లో ఇవీ ఒకటి.
  • క్యాన్సర్‌ చికిత్స తీసుకునే వాళ్లు అలీవ్‌ గింజల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీమోథెరపీ వల్ల మంచి కణజాలాలపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు.
  • మనసు బాగోలేనప్పుడు, తీపి తినాలన్న కోరిక కలిగినప్పుడు వీటిని తీసుకోవడం మంచిది.

  • పిల్లలో ఏకాగ్రత, సత్తువను పెంచడానికి అలీవ్ గింజలు ఉపయోగపడతాయి.
  • ఈ గింజలను కొబ్బరి-నెయ్యితో తీసుకోవడం లేదంటే పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల ఇందులోని పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి.

  • అలీవ్ గింజలు తీసుకోవడం అలవాటు లేని వారు చిటికెడు మాత్రమే తీసుకోవాలి.. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అది కూడా పాలతో, లడ్డూల్లా చేసుకొని తీసుకోవాలి.
  • పిగ్మెంటేషన్‌ని తగ్గించడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి, సంతానోత్పత్తికి, మానసిక ఒత్తిళ్లు-ఆందోళనల్ని దూరం చేయడానికి అలీవ్ గింజలు ఉపయోగపడతాయి.

 

Leave Your Comments

Subabul Cultivation :సుబాబుల్ సాగులో మెళుకువలు

Previous article

Cabbage cultivation: క్యాబేజీ సాగు కు అనువైన రకాలు

Next article

You may also like