Smart Agriculture: మన పూర్వ కాలంలో చదువు రాని వాళ్ళకి మాత్రమే వ్యవసాయం, చదువుకున్న వారు అందరూ మంచి ఉద్యోగం చేసే వాళ్ళు. వ్యవసాయం చేయాలి అనుకున్న ఇంత చదువులు చదివి వ్యవసాయం చేస్తే చిన్న చూపు చూస్తారు అని ఉద్యోగం చేసే వాళ్ళు. కానీ ఇప్పుడు ఉద్యోగం దండగ, వ్యవసాయం మేలు అని ఛత్తీస్‌గఢ్‌లోని కురుద్ బ్లాక్‌లో ఉండే స్మరిక చంద్రాకర్ నిరూపించింది.
ఆమె చాలా కంపెనీలో ఉద్యోగం వదిలేసి, వ్యవసాయం పై ఇష్టంతో తన పొలంలో ఒక అగ్రి స్టార్టుప్ పెట్టింది. స్మరిక చంద్రాకర్ ఎంబీఏ పూర్తి చేశాక చాలా కంపెనీలో ఉద్యోగం వదిలేసి, తన గ్రామంలో ఆధునిక పద్దతిలో వ్యవసాయం చేసి ఒక సంవత్సరంలో కోటి రూపాయలు సంపాదించింది.
స్మరిక తన తండ్రి, తాతయ్య, వ్యవసాయ నిపుణులతో సలహాలు తీసుకొని తనకి ఉన్న 19 ఎకరాలో కూరగాయల సాగు మొదలు పెట్టింది. తన ఫార్మ్కి ధార కృషి ఫార్మ్ పేరుతో స్టార్టుప్ ప్రారంభించింది కూరగాయల సాగుకు నీటికి డ్రైప్పేర్ వాడుతూ నీటిని ఆదాయం చేస్తుంది. పురుగుల మందులు పిచుకరికి ఆటోమేటిక్ యంత్రాలు వాడుతుంది. డ్రిప్ సిస్టమ్ తన లాప్టాప్ సహాయంతో ఆపరేట్ చేస్తుంది.
Also Read: Heatwaves: పంటల పై వడగాలుల ప్రభావం.!
నెల నాణ్యతను బట్టి తన పంట మార్పిడి చేస్తుంది. విత్తనాలలో కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇంటర్నెట్ సహాయంతో ఆధునిక యంత్రాలు, పంటకి కలసిన ఎరువుల గురించి తీసుకొని , వేరే రైతులకి సలహాలు ఇస్తుంది. ఈ స్టార్టుప్ ప్రారంభించిన రెండు సంవత్సరంలో కోటి రూపాయల టర్నోవర్ పొందారు. ఆమె తన ఫార్మ్లో 10 మందికి ఉపాధి కలిపిస్తుంది.
ధార కృషి ఫార్మ్ నుంచి రోజుకి 12 టన్నుల టమాటా, 9 టన్నుల బెండకాయలు మార్కెట్కి దిగుబడి చేస్తుంది. మార్కెట్లో మంచి ధర రావడానికి స్మార్ట్ మార్గాల ద్వారా కూరగాయాలని మార్కెట్కి తరలిస్తోంది. ఇప్పుడు ఒక మహిళా వ్యవసాయంలో తక్కువ రోజులో మంచి గుర్తింపు తెచ్చుకొని అందరికి ఆదర్శంగా నిలుస్తుంది స్మరిక చంద్రాకర్.