Food Security: భారతదేశంలో కొన్ని సంవత్సరాల నుంచి వాతావరణంలో మార్పుల వల్ల అధిక వర్షాలు లేదా ఎండలు ఉంటున్నాయి. రోజు రోజుకి ఈ వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి అనుకూలించడం లేదు. జూన్ మొదటి వారంలో పడాల్సిన వర్షలు ఇప్పటికి కురవకపోవడంతో రైతులు ఇప్పటికి పొలంలో విత్తనాలు విత్తుకోలేదు. దీని కారణంగా పంట పండించే సమయంలో మార్పులు వస్తున్నాయి.
ఈ వాతావరణ మార్పులతో పంట పై ప్రభావమే కాకుండా విత్తనాల నాణ్యత పై కూడా ప్రభావం పడుతుంది. రైతులు పండించే పంటలో కొంత భాగం విత్తనాల కోసం దాచుకుంటారు. గత సంవత్సరంలో జులై, ఆగష్టు నెలలో ఎక్కువ వర్షాలు కురవడం వల్ల మొక్కలకు సరిపోయే పోషకాలు నేల నుంచి తీసుకోలేకపోయాయి. మొక్కలకి సరైన పోషకాలు అందకపోవడంతో ధాన్యం గింజల కూడా బలహీనంగా అవుతాయి. ఎక్కువ వర్షాల వల్ల గింజలో ఉండే ఎండోస్పెర్మ్ లేయర్ , ఇది మొక్క అభివృద్ధికి ఆహారాన్ని నిల్వ చేసి, అంకురోత్పత్తి ఉపయోగ పడే ఎండోస్పెర్మ్ లేయర్ గింజలో లేదు.
Seed Conservation: అంతరించిపోయే పంట విత్తనాలు దాచుకోవడం ఎలా.!
రైతులు గత సంవత్సరం పండించిన పంట 20 టన్నుల చేతికి వస్తుంది అనుకుంటే 15 టన్నులు మాత్రమే వచ్చింది. పండించిన ధాన్యం నాణ్యత తగ్గడంతో విత్తనాలుగా వాడుకోవడానికి వీలుకాలేదు. నాణ్యత తగ్గడంతో పంట ధర కూడా తగ్గింది.
ఈ వాతావరణ మార్పుల వల్ల భారత దేశంలో వచ్చే కాలంలో విత్తనాలకి ముప్పు ఏర్పడవచ్చు. ప్రపంచాన్ని పోషించి ప్రధాన ఆహారం బియ్యం, గోధుమలు ఈ వాతావరణంలో మార్పులు రావడంతో రైతులు ఈ పంటలని పండించడం తగ్గించారు. ప్రతి సంవత్సరం బలహీనమైన ధాన్యం గింజలు 5-7 శాతం వస్తే, గత రెండు సంవత్సరాల నుంచి 20 శాతం పెరగడంతో, పంట పండించిన గింజల్ని విత్తనాలుగా వాడటం లేదు.
వరి, గోధుమలు పండించడానికి 25 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉండాలి. ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరగడం ద్వారా దాదాపు 6 శాతం గింజలో నాణ్యత తగ్గుతుంది. ఇప్పుడు ఉన్న ఉష్ణోగ్రతలో ధాన్యం నాణ్యత చాలా తక్కువ ఉంటుంది. పంట పూత దశలో ఎక్కువ వర్షాలు పడడం వల్ల ధాన్యం మెరుపు తగ్గుతుంది, పరాగసంపర్కాన్ని కూడా తాగిస్తుంది. దీనితో పుప్పొడి ఉండదు అంటే విత్తనాలు కూడా రావు.
Integrated Water Resources Management: నీటి పారుదల శాఖ- సమికృత నీటి నిర్వహణలు
ఉష్ణోగ్రతల పెరగడం, అకాల వర్షంలే కాకుండా, రైతులకు మరొక సమస్య అతి వేగంగా వీచే గాలులు. ఎక్కువ గాలుల వల్ల పూత, పరాగసంపర్కం జరగదు. ఉష్ణోగ్రతల పెరగడం వల్ల పంట అభివృద్ధి వేగంగా జరుగుతుంది, నాణ్యమైన విత్తనాలు వచ్చే సమయం తగ్గిస్తుంది. ఇది పునరుత్పత్తి అభివృద్ధి, పుప్పొడి నిర్మాణం వేగంగా చేసి, చిన్న విత్తనాలగా అభివృద్ధి అవుతాయి.
శాస్త్రవేత్తలు అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే విత్తనాలను తయారు చేయడం ద్వారా ఈ విత్తనాల ముప్పు కోంత వరకు తగ్గించుకోవచ్చు. పండించిన విత్తనాలని సీడ్ బ్యాంకు ద్వారా విత్తనాలని దాచుకొని, విత్తన ముప్పు వచ్చినపుడు వాడుకోవచ్చు. సీడ్ బ్యాంకులో విత్తనాలు కనీసం 100 సంవత్సరాల వరకు నాణ్యతగా ఉంటాయి.