సీఎం జగన్ పారదర్శకంగా కొనుగోలు వ్యవస్థను నడిపిస్తున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి ప్రత్తి కొనుగోలు ప్రక్రియ మొదలెట్టేందుకు చర్యలు తీసుకుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆప్ ద్వారా రాష్ట్రంలోని 50 ఎఎంసిలు , 73 జిన్నింగ్ మిల్స్ సీసీఐ ద్వారా కాటన్ ప్రొక్యూర్మెంట్ చేయనున్నామని కన్నబాబు (Kanna Babu) తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గత ఏడాది సుమారు రైతుల కోసం రూ 90 లక్షలు ప్రభుత్వం వెచ్చించి ఎఎంసి , జిన్నింగ్ మిల్స్ నుంచి సీసీఐ వరకూ కాటన్ రవాణా చేయించాంమన్నారు.
గతేడాది ఎటువంటి సమస్యలు లేకుండా మంచి ధరకు సీసీఐ ద్వారా ప్రత్తిని కొనుగోలు చేయించాం. ప్రత్తి కొనుగులులో ఎఎంసిలు , జిన్నింగ్ మిల్స్ ల వద్ద దళారుల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకుంటాం. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య(Malakondayya), ప్రిన్సిపాల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి(Madhusudhan Reddy) , కమీషనర్లు అరుణ్ కుమార్ (Arun Kumar) (అగ్రికల్చర్,మార్కెటింగ్ ) , శ్రీధర్ (Sreedhar) (హార్టికల్చర్ ), కన్నబాబు (Kanna Babu) (ఫిషరీస్),సీసీఐ (CCI) ప్రతినిధులు పాల్గొన్నారు.
Leave Your Comments