గత మూడు రోజుల వాతావరణం:
గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 33 నుండి 44 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి 30 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి
రాబోవు ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ (ఈరోజు మధ్యాహ్నం 1300 గంటల ఆధారంగా):
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 24గంటలలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చును మరియు తరువాత నాలుగు రోజులలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 37 నుండి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
హెచ్చరిక:
మొదటి రోజు:- హెచ్చరికలు లేవు
రెండవ రోజు:- రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట మరియు యదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి.మీ.) తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
ముడవ రోజు: –హెచ్చరికలు లేవు.
నాల్గవ రోజు:- హెచ్చరికలు లేవు
ఐదోవ రోజు: –హెచ్చరికలు లేవు
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు:-
- వేసవి దుక్కుల వలన భూమిలో నిద్రావస్థలో ఉన్న పంటలపై చీడపీడలు కలిగించే పురుగుల, తెగుళ్ళకు చెందిన వివిధ దశలు భూమిలోనుండి అవి బైటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయదపడిన ప్యూపాలను, గుడ్లను, పక్షులు తిని నాశనం చేస్తాయి ఇలా పలువిధాల మేలు కలగడమే గాక భూమి గుల్లభారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరా చేసుకొని వేసవి దుక్కులను చేసుకోవాలి.
- పండ్ల తోటలో వేసవి కాలంలో గుంటలు తీసి ఎండకు ఎండ నివ్వాలి. దీనివలన నేలలో ఉన్న పురుగులు వాటి గుడ్లు తెగుళ్ళను కలిగించే శిలీంద్రాలు నశిస్తాయి. ఆ తర్వాత పండ్ల మొక్కలు నాటుకోవటం మంచిది.
- రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల క్రింద నిలబడరాదు మరియు పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల క్రింద ఉంచరాదు.
- ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్థంబాలు విద్యుత్ తీగలు మరియు చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండవలెను
- తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన పంటలను (వరి, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము, జొన్న, ప్రొద్దుతిరుగుడు మరియు నువ్వులు మొదలగు పంటలు) ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్ కు తరలించిన దాన్యం తడవకుండా టార్పాలిన్ తో కప్పి వుంచవలెను.
- వర్ష సూచనలున్నందున తాత్కాలికంగా పురుగు మందుల పిచికారి చేయడం వాయిదా వేసుకోవాలి.
పంటల నిర్వహణ (వేసవి నువ్వులు, పెసర, మినుము)

Green Gram (Moong) and Black Gram (Urad Dal) myfavouritepastime.com
- నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని పంట దశ మరియు నేల స్వభావాన్ని బట్టి నీటి తడులు ఇచ్చుకోవాలి.
- నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో తేమ సున్నిత దశలలో పంటకు నీటి తడులు ఇవ్వాలి.
పండ్ల తోటలు:-
- నీటి వసతి అధికంగా ఉన్న ప్రాంతాలలో అదిక ఉష్ణోగ్రతలు తగ్గించడానికి తరచుగా నీరుఇవ్వాలి.
- పండ్లతోట 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే, 150-240 లీటర్ల నీరు ఒక్క రోజుకి ఒక చెట్టుకి అవసరం. అవకాశం ఉన్నచోట సేంద్రీయ మల్చింగ్ తో పాటు బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
- మల్చింగ్ చేయడం వలన నేలలో తేమ ఎక్కువ కాలం నిలువ ఉండి మొక్కకు అందుబాటులో ఉంటుంది. వరి గడ్డి లేదా స్థానికంగా లభించే సేంద్రీయ లేదా పాలిథిన్ షీట్లను మొక్కల మొదళ్ళ చుట్టూ కప్పాలి.
- మామిడి తోటలో ఏప్రిల్ మే మాసంలో 1% పొటాషియం నైట్రేట్ (13-0-45) మందును 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
కూరగాయలపై అధిక ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించడానికి:-
- తరచుగా నీటితడులు ఇవ్వడం ద్వారా నేలలో తేమను సంరక్షిచుకోవచ్చు.
- బిందు సేద్యం చేసే పంటలలో ప్రతిరోజూ అరగంట (ఉదయం మరియు సాయంత్రం) రెండుసార్లు నీటిని HRS Winnova
- 50% షేడ్ నెట్ ని ఉపయోగించడం ద్వారా పంటలపై అధిక ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
వంగ:-
- ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వంగలో కొమ్మ మరియు కాయతొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఎకరానికి 10-15 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. తలలను త్రుంచి 10000 పి.పి.యమ్ వేపనూనెను 3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉదృతి ఎక్కువగా ఉంటే 0.25 మి.లీ. ఫ్లూటెండమైడ్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రినిలిప్రోల్.
మిరప:-
- ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో జెమిని వైరస్ (ఆకుముడత) తెగులు ఆశించుటకు అనుకూలం.
- నివారణకు
- వ్యాధి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి
- పొలం లో కలుపు మొక్కలను నివారించాలి.
- పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8-10 చొప్పున అమర్చాలి.
- నివారణకు 1.5 మి.లీ. సైరిప్రాక్సిపెన్ లేదా 1.0 మి.లీ. పైరిప్రాక్సిఫెన్ + ఫెన్ ప్రోపాత్రిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
- ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు, 1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.3గ్రా. ధయోమిథాక్సిం లేదా 1 గ్రా. డైఫెన్ ధయురాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తీగజాతి కూరగాయలలు
- ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయల పంటలలో పండు ఈగ ఆశించుటకు అనుకూలం. నివారణకు 2.లీ. మలాథియాన్ లేదా 2మి.లీ ప్రొఫెనోఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మామిడి:-
- కాయ కోతకు 15 రోజుల ముందుగా నీటితడులు అందించడం నిలిపివేయాలి.
- ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో కాయతొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 మి.లీ. లాం-సైహాలోత్రిన్ + 2.5 మి.లీ. వేపనూనె 1500 పి.పి.యం. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
- తరచుగా పండు ఈగ గమనించే మామిడి తోటలలో కాయ అభివృద్ధి దశ నుండి పక్వానికి వచ్చే దశలో పాటించవలసిన యాజమన్య పద్ధతులు
– తోటలను శుభ్రంగా ఉంచవలెను
– పండు ఈగ సోకిన కాయలను / పండ్లను ఏరి నాశనం చేయాలి.
– 10000 పి.పి.యం వేప నూనెను పిచికారి చేయాలి.
– పం డుగ ఎరలను (2 మి.లీ. మలాథియాన్ + 2 మి.లీ. మిథైల్ యూజినాల్ మందును లీటరు నీటికి కలిపి) ఒక్కొక్క ప్లాస్టిక్ కంటైనర్ లో 200మి.లీ. ఉంచి ఎకరాకి 6 చొప్పున చెట్టు కొమ్మలకు వ్రేలాడదీయాలి.
కోళ్ళు:-
- కోళ్ళు పొడి మరియు వేడి వాతావరణాన్ని తట్టుకొనుటకు షెడ్లల్లో ఫ్యాన్లను మరియు ఫాగర్స్ ను అమర్చి షెడ్లను వరిగడ్డితో కప్పి స్ప్రింక్లర్లను అమర్చాలి.
- కోళ్ళు ఎక్కువ మోతాదులో తినుటకు అనుగుణంగా మెత్తటిదాణాను పెట్టి త్రాగుటకు చల్లని నీటిని అందుబాటులో ఉండాలి.
పశువులు:-
- ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో పశువులు, గొర్రెలు మరియు మేకలను నీడలో ఉంచవలెను మరియు తగు విధంగా నీరు మరియు మేతను అందించినట్లయితే పశువుల్లో అధిక ఉష్ణోగ్రతల వలన కలిగే ఒత్తిడి తగ్గుతుంది.
- పొడి మరియు అధిక ఉష్ణోగ్రతల వలన పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉండుటకు పాలిచ్చు ఆవులు మరియు గేదెలకు పూత దశలో ఉన్న పశుగ్రాసాలను మేతగా వేయవలెను.
ప్రధాన శాస్త్రవేత్త (ఆగ్రానమీ) & అధిపతి