Vemula Prashanth Reddy: తెలంగాణాలో తెరాస బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వ్యవసాయ రంగంపై తెరాస, బీజేపీ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలతో హీటెక్కిస్తున్నారు. తాజాగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy)మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ ని విమర్శించే అర్హత బీజేపీ నాయకులకు లేదు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతుబంధు ఇస్తున్నారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు మంత్రి వేముల. తెలంగాణాలో అన్నదాతల అప్పుల బాధలు తీర్చింది కేసిఆరే. రైతు సంక్షేమం కోసం మా ప్రభుత్వం 3 లక్షల కోట్లు వెచ్చించామని అన్నారు మంత్రి. ఉచిత విద్యుత్ కోసం 50 వేల కోట్లు, సాగు నీటి కోసం 1.80 వేల కోట్లు ఖర్చు చేశాం. అదేవిధంగా రైతుబంధు పథకం కిందా రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్లు ఖర్చు చేయడం చారిత్రాత్మకమని చెప్పారు మంత్రి వేముల.
Also Read: అకాల వర్షాలతో రైతన్న కుదేలు.. చేతికొచ్చిన పంట దెబ్బతిందని దిగులు
కాగా రైతుబంధు (Rythubandhu Scheme) సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఎడ్లబండి ర్యాలీలు, ట్రాక్టర్ల ప్రదర్శనలు, మహిళలు రైతుబంధు పేరుతో సీఎం కెసిఆర్ చిత్ర పటంతో సందడి చేస్తున్నారు. ఊరూరా జరుగుతున్న రైతుబంధు సంబరాల్లో మంత్రులు, ఎమ్యెల్యేలు పాల్గొని సందడి చేస్తున్నారు. కాగా.. ఈ సంబరాల్లో మంత్రులు మాంత్రులు మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో కూడా సీఎం కెసిఆర్ రైతుబంధు సొమ్ముని రైతు ఖాతాలోకి జమ చేశారని గుర్తు చేశారు. రైతు పదికాలాల పాటు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కెసిఆర్ లక్ష్యమని, అందుకోసం రైతుబంధు, రైతుభీమా పధకాలు అమలు చేశారని కెసిఆర్ పై ప్రశంసలు కురిపించారు.
కాగా. ఈ సారి రైతుబంధు సాయంతో పాటు లబ్దిదారుల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటికే వానాకాలం సీజన్‌లో 61 లక్షల మందికి.. 7 వేల 377 కోట్లు సాయంగా అందించారు. యాసంగిలో లబ్దిదారుల సంఖ్య అరవై ఆరున్నర లక్షలకు చేరుకోగా 7వేల 600 కోట్లను ఖర్చు చేయనున్నారు.
Also Read: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో గంజాయి సాగు- రేవంత్ రెడ్డి